Anil Ravipudi: అనిల్ దర్శకత్వంలో బాలయ్య మల్టీస్టారర్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

టాలీవుడ్ లో ఫెయిల్యూర్ చూడని కొద్దిమంది దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ తెరకెక్కించడంలో దిట్టైన అనిల్.. మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు..

Anil Ravipudi: అనిల్ దర్శకత్వంలో బాలయ్య మల్టీస్టారర్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

Anil Ravipudi

Anil Ravipudi: టాలీవుడ్ లో ఫెయిల్యూర్ చూడని కొద్దిమంది దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ తెరకెక్కించడంలో దిట్టైన అనిల్.. మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో స్టార్ హీరోల దర్శకుడిగా మారిపోయాడు. ప్రస్తుతం వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ తో ఎఫ్ 3 చేస్తున్న అనిల్.. మేలో ఈ సినిమాను థియేట‌ర్ల‌లో తీసుకొచ్చేందుకు ముమ్మర పనులలో ఉన్నాడు. ఎఫ్‌2 ఇప్ప‌టికే బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌ కాగా.. సీక్వెల్ గా వస్తున్న ఎఫ్ 3 సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

Anil Ravipudi: దర్శకుడి ఆఫీస్‌కెళ్ళి మరీ ర్యాగింగ్ చేసిన తారక్!

కాగా ఈ సినిమా సెట్స్ పై ఉండగానే అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ఏదో ఒక‌ క్రేజీ గాసిప్ తెర‌పైకి వ‌స్తూనే ఉంది. అనిల్ ఎఫ్ 3 తర్వాత నటసింహం బాల‌కృష్ణతో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చేయగా.. ఇది మ‌ల్టీస్టారర్ సినిమా అనే వార్త‌లు కూడా బాగా ప్రచారంలో ఉన్నాయి. అయితే.. దీనిపై స్పందించిన అనిల్ రావిపూడి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.

Anil Ravipudi : బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌కి భలే చిక్కొచ్చి పడిందే.. ముగ్గురిలో ఎవరితో సినిమా?..

తాను ప్ర‌స్తుతం ఎఫ్ 3 మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్నానని.. ఈ సినిమా తర్వాత బాల‌కృష్ణ సినిమా కోసం కూడా క‌థ ఇప్ప‌టికే రెడీ అయిందని చెప్పిన అనిల్ రావిపూడి.. ప్రచారం జరుగుతున్నట్లుగా ఇది మల్టీస్టారర్ సినిమా కాదని.. ఇది సింగిల్ హీరో సినిమా అని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఎఫ్ విడుద‌ల తర్వాత దీనిపై మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేస్తామని.. నేను ప్ర‌స్తుతం పూర్తిగా ఎఫ్ 3 సినిమాపైనే ప‌నిచేస్తున్నాన‌ని చెప్పాడు. దీంతో అనిల్-బాలయ్య సినిమాపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.