Anil Ravipudi : బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌కి భలే చిక్కొచ్చి పడిందే.. ముగ్గురిలో ఎవరితో సినిమా?..

రైటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి డైరెక్టర్‌గా మారిన అనిల్ రావిపూడి అంతే స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నారు. సింపుల్ స్టోరీ లైన్‌ని తీసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి కామెడీని హైలెట్ చేసి సినిమాలు తీసి సక్సెస్ కొడుతున్నఅనిల్ రావిపూడి ముగ్గురు హీరోల కోసం స్క్రిప్ట్ లు రెడీ చేసుకున్నాడు..

Anil Ravipudi : బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌కి భలే చిక్కొచ్చి పడిందే.. ముగ్గురిలో ఎవరితో సినిమా?..

Anil Ravipudi

Anil Ravipudi: రైటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి డైరెక్టర్‌గా మారిన అనిల్ రావిపూడి అంతే స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నారు. సింపుల్ స్టోరీ లైన్‌ని తీసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి కామెడీని హైలెట్ చేసి సినిమాలు తీసి సక్సెస్ కొడుతున్నఅనిల్ రావిపూడి ముగ్గురు హీరోల కోసం స్క్రిప్ట్ లు రెడీ చేసుకున్నాడు. మరి ఏ హీరోతో సినిమా స్టార్ట్ చెయ్యబోతున్నాడు..?

అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘ఎఫ్ 2’ సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ సినిమాకి సీక్వెల్ చేస్తానని అప్పుడే అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 27 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన అనిల్ రావిపూడి అనుకున్నట్టే సినిమాని ఫాస్ట్‌గా షూటింగ్ చేస్తున్నారు. కరోనాతో కాస్త అప్పుడప్పుడు షూటింగ్‌కి బ్రేక్ పడుతున్నా.. మేజర్ పార్ట్ మాత్రం కంప్లీట్ చేసేశారు యూనిట్. ‘ఎఫ్ 3’ కంప్లీట్ అయ్యాక ఆగస్ట్ నుంచి అనిల్ ఖాళీనే. అందుకే ఇప్పటినుంచి నెక్ట్స్ సినిమా ఎవరితో, ఏంటి అనే దాని మీద కసరత్తులు మొదలుపెట్టారు.

F3 Movie

అనిల్ రావిపూడి నెక్ట్స్ చేస్తున్న సినిమా బాలయ్యతోనే అనే టాక్ వినిపిస్తోంది. బాలయ్య కోసం కథ ఎప్పుడో రాసుకున్నారు అనిల్. బాలకృష్ణకు కూడా చాలా కాలం క్రితమే స్టోరీ కూడా చెప్పేశాడు. అయితే బాలయ్య సినిమాల్లో బిజీగా ఉండటంతో ఈప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే ఛాన్సులున్నాయని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేసిన అనిల్ రావిపూడి బాలకృష్ణతో కంటే ముందే.. మహేష్‌తో మరో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సూపర్‌స్టార్ కూడా అనిల్‌తో సినిమా చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్లో మరోసారి సినిమా తెరకెక్కే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

Sarileru Neekevvaru

అనిల్ రావిపూడి హీరోల లిస్ట్‌లో ఉన్న స్టార్ రామ్ పోతినేని. ఈ ఎనర్జిటిక్ స్టార్ ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత మళ్లీ డల్ అయ్యాడు. ‘రెడ్’ సినిమా అంత సక్సెస్ అవ్వకపోవడంతో మళ్లీ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లోకి రావాలని చూస్తున్నాడు. అందుకే అనిల్ రావిపూడితో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నారని రూమర్. ప్రజెంట్ లింగుస్వామితో సినిమా చేస్తున్న రామ్.. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక అనిల్‌తో సినిమా చేస్తున్నాడన్న టాక్ టాలీవుడ్‌లో గట్టిగానే వినిపిస్తోంది. మరి ఈ ముగ్గురు హీరోల్లో అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే హీరో ఎవరన్నది త్వరలో తెలుస్తుంది..