Buchibabu Sana : మోదీ గారు చెప్పింది పరిగణలోకి తీసుకున్నాం.. ‘పెద్ది’ సక్సెస్ మీట్ లో బుచ్చిబాబు వ్యాఖ్యలు వైరల్..
నేడు మూవీ యూనిట్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు.(Buchibabu Sana)
Buchibabu Sana
Buchibabu Sana : రామ్ చరణ్ పెద్ది సినిమా ఇటీవల జూన్ 4న థియేటర్స్ లో రిలీజ్ అయి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే 300 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది పెద్ది సినిమా. నేడు మూవీ యూనిట్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు.
Also Read : Priyanka Nalkar : బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సీరియల్ యాక్టర్.. ఏమని చెప్పిందంటే..?
ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఇది ఒక ఇన్స్పిరేషనల్ సినిమా. మోదీ గారు 2016 – 17 సమయంలో ఖేళో ఇండియా అనేది తీసుకొచ్చారు. మట్టిలో మాణిక్యాలు లాంటి ఆటగాళ్లను బయటకు తీయాలి అని ఖేళో ఇండియా తెచ్చారు. అది కూడా పరిగణలోకి తీసుకున్నాను కథ రాసేటప్పుడు. మన విలేజ్ లో 100 కేజీల మూటలు మోసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి కూలీలుగా ఉన్నారు. ఆటల్లోకి వెళ్తే హెవీ వెయిట్ ఛాంపియన్ అవుతాడు అని నేను నమ్ముతా. మా ఊరి దగ్గర సముద్రం పక్కన చూస్తుంటే చాలా మంది ఫిషర్ మెన్స్ ఎలాంటి సేఫ్టీ లేకుండా సముద్రంలోకి దిగుతారు. వీళ్ళు ఒలంపిక్స్ కి వెళ్తే మెడల్స్ తెస్తారు అని ఫీల్ అవుతా.
అందుకే సినిమాల్లో కూడా వస్తువులతో, పనులతో ఆటను చూపించాను. భారతీయ జీవన విధానంలోనే ఆట ఉంది అని చెప్పడానికి ప్రయత్నించా. ఇది కమర్షియల్ సినిమాలా చేయొచ్చు కానీ ఆట ముఖ్యంగా చూపించాను. ఊరి కోసం, గుర్తింపు కోసం ఏం చేస్తారో చెప్పాలని ప్రయత్నించా. బయటి ప్రపంచంతో సంబంధం లేని ఉన్న గ్రామాలు ఇంకా ఉన్నాయి. అలాంటి వాళ్లకు గుర్తింపు రావాలని ప్రయత్నం చేశా. ఈ ప్రయత్నానికి రామ్ చరణ్ ముందుండి తీసుకెళ్లారు. నిన్న చరణ్ గారితో ఐమాక్స్ కి వెళ్తే హాస్పిటల్ సీన్ లో ఆడియన్స్ లేచి చరణ్ వైపు చూసి తల దించి గ్రేట్ అంటూ అభినందిస్తున్నారు అని తెలిపారు.
Also Read : Peddi Collections : 300 కోట్ల క్లబ్‌కు చేరువలో.. నాలుగు రోజుల్లో పెద్ది కలెక్షన్స్ ఎంతంటే?
