Unstoppable : బాలకృష్ణ తొడ కొడితే ట్రైన్ వెళ్లిపోయే సీన్ పై ట్రోలింగ్.. స్పందించిన బాలయ్య..

ఈ ఎపిసోడ్ లో రాజకీయాలు మాట్లాడిన అనంతరం మళ్ళీ సరదాగా సినిమాలు, సరదా మాటలు కూడా మాట్లాడుకున్నారు. బాలయ్య గతంలో పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో తొడ కొడితే ట్రైన్ వెనక్కి వెళ్లే సీన్ లో నటించారు. అప్పుడు ఆ సీన్ పండినా తర్వాత తొడ కొడితే ట్రైన్ వెళ్లిపోవడం ఏంటని ట్రోల్స్ చేశారు. తాజాగా దానిపై బాలకృష్ణ స్పందించారు.............

Unstoppable : బాలకృష్ణ తొడ కొడితే ట్రైన్ వెళ్లిపోయే సీన్ పై ట్రోలింగ్.. స్పందించిన బాలయ్య..

Balakrishna reactions on Palnati Brahmanayudu Train Scene in Unstoppable

Unstoppable :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో సూపర్ గా సక్సెస్ అయింది. మొదటి సీజన్ గ్రాండ్ గా సక్సెస్ అవ్వడంతో రెండో సీజన్ కూడా మరింత గ్రాండ్ గా చేశారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని మరో రేంజ్ కి తీసుకెళ్లారు. బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి పార్ట్ 1ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేశారు ఆహా. ఈ ఎపిసోడ్ ఎక్కువ స్ట్రీమింగ్ టైం సాధించి సరికొత్త రికార్డులని సెట్ చేసింది. ఈ ఎపిసోడ్ లో సరదాగా మాట్లాడుతూ, సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. తాజాగా ఫిబ్రవరి 9 గురువారం రాత్రి బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 రిలీజ్ చేశారు.

బాలయ్య-పవన్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి అటు బాలయ్య అభిమానులు, ఇటు పవన్ అభిమానులు హంగామా చేశారు. వరుసగా పోస్టర్లు, ఫోటోలు, ప్రోమోలు.. వదులుతూ ఆహా టీం కూడా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా రిలీజ్ అయిన పవన్ బాలయ్య ఎపిసోడ్ తో ఈ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. మొదటి పార్ట్ లో అంతా సినిమాలు, పర్సనల్ లైఫ్ ఉంటే రెండో పార్టీ లో చాలా వరకు పాలిటిక్స్ గురించి ఉంది. దీంతో ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఎపిసోడ్ లో రాజకీయాలు మాట్లాడిన అనంతరం మళ్ళీ సరదాగా సినిమాలు, సరదా మాటలు కూడా మాట్లాడుకున్నారు. బాలయ్య గతంలో పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో తొడ కొడితే ట్రైన్ వెనక్కి వెళ్లే సీన్ లో నటించారు. అప్పుడు ఆ సీన్ పండినా తర్వాత తొడ కొడితే ట్రైన్ వెళ్లిపోవడం ఏంటని ట్రోల్స్ చేశారు. తాజాగా దానిపై బాలకృష్ణ స్పందించారు.

Balayya-Pawan : బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ కి పవన్ ఏమన్నాడు?

డైరెక్టర్ క్రిష్ ఇద్దరి హీరోలని ప్రశ్నిస్తూ.. మీరెప్పుడైనా నచ్చకపోయినా డైరెక్టర్ చెప్పింది చేశారా అని అడగగా ఇద్దరు ఔను అని చెప్పారు. బాలయ్య ఆ సీన్ ని గుర్తు చేస్తూ.. తొడ కొడితే ట్రైన్ వెళ్లిపోయే సీన్ ఇప్పుడు పెట్టి ఉంటే సోషల్ మీడియాలో మాములుగా ట్రోల్ చేయరు. ఆల్రెడీ చేశారు, ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు. అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి బతికిపోయాం అని అన్నారు. దీంతో మరోసారి బాలయ్య తొడ కొడితే ట్రైన్ వెళ్లిపోయే సీన్ వైరల్ గా మారింది.