Balayya-Pawan : బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ కి పవన్ ఏమన్నాడు?

ఎపిసోడ్ లో పొలిటికల్ అంశాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ కాసేపు సరదాగా మాట్లాడారు బాలయ్య-పవన్. ఈసందర్భంగా పవన్ ని కొన్ని ప్రశ్నలు అడుగుతానని పవన్ వాటికి సమాధానాలు రాయాలని, అంతకుముందే అక్కడున్న అభిమానులు వాటికి సమాధానం చెప్పాలని అన్నారు బాలయ్య................

Balayya-Pawan : బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ కి పవన్ ఏమన్నాడు?

Pawan Kalyan Reacts on Balakrishna Pawan Kalyan Multi starer

Updated On : February 10, 2023 / 12:59 PM IST

Balayya-Pawan :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో సూపర్ గా సక్సెస్ అయింది. మొదటి సీజన్ గ్రాండ్ గా సక్సెస్ అవ్వడంతో రెండో సీజన్ కూడా మరింత గ్రాండ్ గా చేశారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని మరో రేంజ్ కి తీసుకెళ్లారు. బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి పార్ట్ 1ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేశారు ఆహా. ఈ ఎపిసోడ్ ఎక్కువ స్ట్రీమింగ్ టైం సాధించి సరికొత్త రికార్డులని సెట్ చేసింది. ఈ ఎపిసోడ్ లో సరదాగా మాట్లాడుతూ, సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. తాజాగా ఫిబ్రవరి 9 గురువారం రాత్రి బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 రిలీజ్ చేశారు.

బాలయ్య-పవన్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి అటు బాలయ్య అభిమానులు, ఇటు పవన్ అభిమానులు హంగామా చేశారు. వరుసగా పోస్టర్లు, ఫోటోలు, ప్రోమోలు.. వదులుతూ ఆహా టీం కూడా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా రిలీజ్ అయిన పవన్ బాలయ్య ఎపిసోడ్ తో ఈ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. మొదటి పార్ట్ లో అంతా సినిమాలు, పర్సనల్ లైఫ్ ఉంటే రెండో పార్టీ లో చాలా వరకు పాలిటిక్స్ గురించి ఉంది. దీంతో ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఎపిసోడ్ లో పొలిటికల్ అంశాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ కాసేపు సరదాగా మాట్లాడారు బాలయ్య-పవన్. ఈసందర్భంగా పవన్ ని కొన్ని ప్రశ్నలు అడుగుతానని పవన్ వాటికి సమాధానాలు రాయాలని, అంతకుముందే అక్కడున్న అభిమానులు వాటికి సమాధానం చెప్పాలని అన్నారు బాలయ్య. పవన్ హిందీ సినిమా చేయాలి అనే దానికి ఫ్యాన్స్ ఎస్ అంటే పవన్ నో చెప్పాడు. పవన్ యాక్షన్ సినిమాలు తీయాలి అంటే ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఎస్ చెప్పారు. వైఫ్ కి పవన్ ఎప్పుడైనా సారీ చెప్తారా అంటే ఫ్యాన్స్ నో చెప్పగా పవన్.. గొడవలు రాకుండా చూసుకుంటాం, సారీలు చెప్పే అవసరం రాకుండా అని రాసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

Pawan Kalyan : పవన్ కి స్థలం ఇచ్చానని నా ఇల్లు కూలగొట్టారు.. ఇప్పటం గ్రామం పెద్దావిడ ఆవేదన

ఇక బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ చేద్దాం అంటే పవన్ ఓకే చెప్పాడు. అభిమానులు కూడా చేయాలి అని అన్నారు. ఎపిసోడ్ కి వచ్చిన డైరెక్టర్ క్రిష్ కథ కూడా రెడీగా ఉంది చెప్పమంటారా అని అడిగాడు. మరి భవిష్యత్తులో వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ఏమైనా వస్తుందేమో చూడాలి. అలాగే పవన్ సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాడా అని బాలయ్య అడగగా పవన్ ఎస్ అంటే అభిమానులు నో చెప్పారు. అయితే బాలయ్య నువ్వు రెండు పడవల మీద వెళ్ళు సినిమాలు చేస్తూ రాజకీయాల్లో ఉండు అని అన్నారు.