Bimbisara: బింబిసార కోసం అఖండ ఆగమనం..?

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బింబిసార’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాగా, ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహించాలని చిత్ర యనిట్ భావిస్తోంది. ఈ బింబిసార స్పెషల్ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణను మఖ్య అతిథిగా పిలిచేందుకు కళ్యాణ్ రామ్ రెడీ అవుతున్నాడు.

Bimbisara: బింబిసార కోసం అఖండ ఆగమనం..?

Balakrishna To Attend New Event Of Bimbisara

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా ప్రెస్టీజియస్ మూవీ ‘బింబిసార’ ఇప్పటికే తెలుగునాట ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను వశిష్ఠ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తుండగా, హిస్టారికల్ ఫాంటెసీ థ్రిల్లర్‌గా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తొలిసారి ఓ హిస్టారికల్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అటు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బింబిసార’ సినిమా గ్యారెంటీ హిట్ అనే హింట్ ఇవ్వడంతో ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Bimbisara : బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్

అయితే ఈ సినిమాను జనంలోకి మరింతగా తీసుకెళ్లాలని కళ్యాణ్ రామ్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘బింబిసార’ కోసం మరో ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహించాలని ఆయన భావిస్తున్నాడట. అంతేగాక ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణను తీసుకురావాలని కళ్యాణ్ రామ్ చూస్తున్నాడట. బాలయ్య ఈ ఈవెంట్‌కు వస్తే, ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేయొచ్చని ఆయన భావిస్తున్నాడు. అందుకే ఈ ఈవెంట్‌ను అత్యంత గ్రాండ్‌గా నిర్వహించాలని కళ్యాణ్ రామ్ రెడీ అవుతున్నాడట.

Bimbisara: సెన్సార్ ముగించుకున్న బింబిసారా

ఇప్పటికే బింబిసార ప్రీరిలీజ్ ఈవెంట్‌లో తారక్‌తో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేయడంలో కళ్యాణ్ రామ్ సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం బాలయ్యను తీసుకొచ్చి బింబిసారపై అంచనాలను రెట్టింపు చేయాలని కళ్యాణ్ రామ్ ప్లాన్ చేస్తున్నాడు. మరి నిజంగానే బింబిసార కోసం అఖండ వస్తాడా.. ఒకవేళ బాలయ్య ఈ ఈవెంట్‌కు వస్తే.. బింబిసారపై అంచనాలు అమాంతం పెరిగిపోవడం ఖాయమని చిత్ర విశ్లేషకులు అంటున్నారు. కాగా, బింబిసార చిత్రంలో కేథరిన్ త్రేజా, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.