Bimbisara: సెన్సార్ ముగించుకున్న బింబిసారా

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లెటెస్ట్ మూవీ ‘బింబిసారా’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని ఆగస్టు 5న రిలీజ్‌కు రెడీ అయ్యింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకోగా, సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది.

Bimbisara: సెన్సార్ ముగించుకున్న బింబిసారా

Bimbisara Completes Censor Works

Bimbsara: నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘బింబిసారా’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ ఫాంటెసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. ఇక రిలీజ్‌కు రెడీగా ఉన్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది.

Bimbisara: రామారావును ఫాలో అవుతోన్న బింబిసారుడు

‘బింబిసారా’ చిత్రాన్ని సరికొత్త కాన్సెప్ట్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమా కథ చాలా వైవిధ్యంగా ఉందని, ఇలాంటి సినిమాలు ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయని సెన్సార్ బోర్డు సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Bimbisara: రిలీజ్ ట్రైలర్‌తో కళ్యాణ్ రామ్ అరాచకం.. ఈసారి కొట్టేలాగే ఉన్నాడు!

అటు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్ వస్తుండటం, ఇప్పటికే ఆయన ఈ సినిమాను చూసి బ్లాక్‌బస్టర్ అని ‘బింబిసారా’ టీమ్‌కు చెప్పడంతో, చిత్ర యూనిట్ రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. పవర్‌ఫుల్ పాత్రలో కళ్యాణ్ రామ్ నటన ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. కాగా, ఈ సినిమాలో అందాల భామలు కేథరిన్ త్రేజా, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు కళ్యాణ్ రామ్ రెడీ అవుతున్నాడు.