Bimbisara: రామారావును ఫాలో అవుతోన్న బింబిసారుడు

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఫాంటెసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘బింబిసారా’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమా ఒక్క విషయంలో రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను ఫాలో అవుతుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

Bimbisara: రామారావును ఫాలో అవుతోన్న బింబిసారుడు

Bimbisara Runtime Locked

Bimbisara: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఫాంటెసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘బింబిసారా’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో ఈసారి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ కొట్టితీరాలనే కసితో ఉన్నాడు హీరో కళ్యాణ్ రామ్. అయితే ఈ సినిమాను ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు కళ్యాణ్ రామ్ రెడీ అవుతుండగా.. ఈ సినిమా ఒక్క విషయంలో మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఫాలో అవుతున్నాడు బింబిసారుడు.

Bimbisara: రిలీజ్ ట్రైలర్‌తో కళ్యాణ్ రామ్ అరాచకం.. ఈసారి కొట్టేలాగే ఉన్నాడు!

ఇంతకీ రామారావును ఏ విషయంలో బింబిసారుడు ఫాలో అవుతున్నాడు అని మీరు ఆలోచిస్తున్నారా.. రవితేజ రామారావు ఆన్ డ్యూటీ చిత్రం సెన్సార్ పనులను పూర్తి చేసుకుని రన్‌టైమ్‌‌ను 2 గంటల 26 నిమిషాలకు లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బింబిసారా చిత్రం నిడివి కూడా 2 గంటల 26 నిమిషాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. రామారావు రన్ టైమ్ మాదిరిగానే ప్రేక్షకులను ఎంగేజింగ్‌లో పెట్టేందుకు బింబిసారుడు ఎంచుకున్న రన్‌టైమ్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చే అంశమని పలువురు కామెంట్ చేస్తున్నారు.

Ramarao On Duty: సెన్సార్ ముగించుకున్న రామారావు.. రన్ టైమ్ ఎంతంటే?

ఏదేమైనా రామారావు ఆన్ డ్యూటీ ఫుల్టూ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా వస్తుండగా, బింబిసారా మూవీ మాత్రం ఫాంటెసీ థ్రిల్లర్ కథాంశంతో వస్తుండటం విశేషం. ఇక కళ్యాణ్ రామ్ సరసన ఈ సినిమాలో అందాల భామలు కేథరిన్ త్రేజా, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా, ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి రామారావును ఫాలో అవుతున్న బింబిసారా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో తెలియాలంటే ఆగస్టు 5 వరకు వెయిట్ చేయాల్సిందే.