NBK107: బాలయ్య ద్విపాత్రాభినయం.. మరోసారి తండ్రికొడుకులుగా?

అఖండ మొన్ననే అలా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిందో లేదో బాలకృష్ణ మరో సినిమాని సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే నలుగురు

NBK107: బాలయ్య ద్విపాత్రాభినయం.. మరోసారి తండ్రికొడుకులుగా?

Nbk107

NBK107: అఖండ మొన్ననే అలా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిందో లేదో బాలకృష్ణ మరో సినిమాని సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే నలుగురు క్రేజీ డైరెక్టర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య.. అందులో రీసెంట్ గా గోపీచంద్ మలినేనితో షూటింగ్ కూడా మొదలు పెట్టారు. గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో కొత్త సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ కు అభిమానులు ఫిదా అయిపోయారు.

NBK107: బాలయ్య ఫస్ట్ లుక్.. స్టైలిస్ట్ మాసివ్ అవతార్!

కాగా, ఇప్పుడు మరో అప్డేట్ ఒకటి టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇందులో బాలయ్య తండ్రీకొడుకులుగా కనిపిస్తారని.. ఒకటి పక్కా మాసివ్ పాత్ర కాగా.. మరొకటి సాలిడ్ యాక్షన్ పాత్రలో కనిపించనున్నాడని.. ఈ రెండు పాత్రల మధ్య వేరియేషన్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు.. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమా అక్కడి నీటి సమస్య చుట్టూ ఈ కథ తిరుగుతుందని టాక్ నడుస్తుంది.

NBK107: కన్నడ మఫ్టీకి రీమేక్ ప్రచారం.. అసలు నిజమేంటి?

ఫస్ట్ లుక్ లోనే మాస్ ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో పెంచిన ఈ సినిమాలో శృతీహాసన్ హీరోయిన్ కాగా, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి పాపులర్ స్టార్స్ కీరోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమా కోసం ‘వీరసింహా రెడ్డి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. గతంలో పెద్దన్నయ్య, సుల్తాన్, చెన్నకేశవరెడ్డి సినిమాలలో డ్యూయెల్ రోల్ లో కనిపించగా.. అంతకు ముందు శ్రీ కృష్ణార్జున విజయం సాంఘీక సినిమాలో కూడా ద్విపాత్రాభినయం చేశారు.