NBK107: కన్నడ మఫ్టీకి రీమేక్ ప్రచారం.. అసలు నిజమేంటి?

అఖండ బ్లాక్ బాస్టర్ హిట్ తో దూసుకుపోతున్న బాలకృష్ణ..ఇప్పటికే నలుగురు క్రేజీ డైరెక్టర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో రీసెంట్ గా గోపీచంద్ మలినేనితో షూటింగ్ కూడా మొదలు పెట్టారు.

NBK107: కన్నడ మఫ్టీకి రీమేక్ ప్రచారం.. అసలు నిజమేంటి?

Nbk107

NBK107: అఖండ బ్లాక్ బాస్టర్ హిట్ తో దూసుకుపోతున్న బాలకృష్ణ..ఇప్పటికే నలుగురు క్రేజీ డైరెక్టర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో రీసెంట్ గా గోపీచంద్ మలినేనితో షూటింగ్ కూడా మొదలు పెట్టారు. గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో కొత్త సినిమా షూటింగ్ ను సిరిసిల్లలో ప్రారంభించారు. మాస్ ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో పెంచిన ఈ సినిమాలో శృతీహాసన్ హీరోయిన్ కాగా, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి పాపులర్ స్టార్స్ కీరోల్స్ ప్లే చేస్తున్నారు.

RRR: రిలీజ్ డేట్ ఇచ్చినా ప్రమోషన్ లేదేంటి జక్కన్నా?

ఫిబ్రవరి 18న తెలంగాణలోని సిరిసిల్ల ప్రాంతంలో షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమాకి కీలకమైన షెడ్యూల్ పూర్తిచేస్తున్నారు. ఈ మేరకు స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ తో కూడిన ఫోటోను షేర్ చేసిన దర్శకుడు గోపిచంద్ హంట్ బిగిన్స్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫోటోలో బాలయ్య లేకపోగా.. షూటింగ్ జరుగుతున్న ప్లేస్ నుండి హీరో బాలయ్య కుర్చీలో కూర్చొని ఉన్న సన్నివేశంలోని ఫోటో ఒకటి బయటకొచ్చింది.

NBK107: ఆగని లీకులు.. బాలయ్య సినిమాకూ ఎఫెక్ట్!

ఇందులో బాలకృష్ణ ఊర మాస్ లుక్‌లో, రఫ్ గడ్డంతో కనిపిస్తున్నాడు. బాలయ్య లుక్ మీద అభిమానులు హ్యాపీగానే ఉన్నా.. ఫస్ట్ లుక్ ఎఫెక్ట్ కు ఇది మైనస్ అవుతుందని మేకర్స్ బాధపడుతున్నారు. ఇక మరో వర్గం ఇది ఓ కన్నడ సినిమాకి రీమేక్ అని ప్రచారం మొదలు పెట్టింది. కన్నడలో 2017లో శివరాజ్ కుమార్ ‘మఫ్టీ’ అనే సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. శివరాజ్ కుమార్ కెరియర్లోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. ఈ సినిమాకి నార్తన్ దర్శకత్వం వహించాడు.

Balakrishna: అన్‌స్టాపబుల్ మూవీ లైనప్.. జోరు మీదున్న బాలయ్య!

మఫ్టీలో శివరాజ్ కుమార్ కుర్చీలో కూర్చున్న పిక్.. ఇప్పుడు బాలయ్య సినిమా నుండి లీక్ అయిన ఫోటోలలో లుక్ ఒకే విధంగా ఉండడంతోనే ఈ ప్రచారం మొదలు పెట్టారు. అయితే, దర్శక, నిర్మాతలు ఈ సినిమాకి మఫ్టీకి అసలు ఎలాంటి సంబంధం లేదని.. ఇది ఏ సినిమాకి రీమేక్ కాదని స్పష్టం చేశారు. రాయలసీమ, కర్ణాటక బోర్డర్ లో జరిగే ఫ్యాక్షన్ కథ ఆధారంగా దర్శకుడు గోపీ చంద్ స్వయంగా రీసెర్చ్ చేసి అల్లుకున్న కథ ఇదని సమాచారం.