NBK107: ఆగని లీకులు.. బాలయ్య సినిమాకూ ఎఫెక్ట్!

కలిసొచ్చిన దర్శకుడు బోయపాటితో కలిసి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు వరస సినిమాలను ఒకే చేస్తున్నారు. అఖండ షూటింగ్ లో ఉండగానే దర్శకుడు గోపీచంద్..

NBK107: ఆగని లీకులు.. బాలయ్య సినిమాకూ ఎఫెక్ట్!

Nbk107

NBK107: కలిసొచ్చిన దర్శకుడు బోయపాటితో కలిసి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు వరస సినిమాలను ఒకే చేస్తున్నారు. అఖండ షూటింగ్ లో ఉండగానే దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా ఖరారు చేసుకున్న బాలయ్య ఆ మధ్య ఆ సినిమాకు ముహూర్తం కూడా పెట్టేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా శృతి హాసన్ బాలయ్యకి జోడీగా నటిస్తుంది. అఖండ సినిమా సక్సెస్ కీలకమైన థమన్ ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు.

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా కెటిఆర్

ఆ మధ్య ముహూర్తం కార్యక్రమాన్ని జరుపుకున్న ఈ సినిమా శుక్రవారం నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు. ఫిబ్రవరి 18న తెలంగాణలోని సిరిసిల్ల ప్రాంతంలో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇది సినిమాకి కీలకమైన షెడ్యూల్ కాగా.. ఈ షెడ్యూల్ తో స్టార్ట్ చేశారట. ఈ మేరకు స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ తో కూడిన ఫోటోను షేర్ చేసిన దర్శకుడు గోపిచంద్ హంట్ బిగిన్స్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫోటోలో బాలయ్య లేదు. ఎందుకంటే.. హీరో గెటప్ రిలీవ్ అవుతుందని మేకర్స్ జాగ్రత్త పడ్డారు.

Project K : ప్రభాస్‌తో పని చేయడం నాకు గౌరవం.. ప్రభాస్‌పై అమితాబ్ ట్వీట్..

అయితే.. ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమని లీకుల బెడద వేధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే సర్కారు వారి పాట నుండి కళావతి సాంగ్ లీక్ సెన్సేషన్ కాగా.. భీమ్లా నాయక్ కి కూడా లీకుల ఎఫెక్ట్ తగిలింది. ఇప్పుడు బాలయ్య సినిమాకి కూడా ఈ ఎఫెక్ట్ తప్పలేదు. సిరిసిల్ల ప్రాంతంలో షూటింగ్ జరుగుతున్న ప్లేస్ నుండి హీరో బాలయ్య కుర్చీలో కూర్చొని ఉన్న సన్నివేశంలోని ఫోటో ఒకటి బయటకొచ్చింది. ఇందులో బాలకృష్ణ ఊర మాస్ లుక్‌లో, రఫ్ గడ్డంతో కనిపిస్తున్నాడు. బాలయ్య లుక్ మీద అభిమానులు హ్యాపీగానే ఉన్నా.. ఫస్ట్ లుక్ ఎఫెక్ట్ కు ఇది మైనస్ అవుతుందని మేకర్స్ బాధపడుతున్నారు.