RRR: రిలీజ్ డేట్ ఇచ్చినా ప్రమోషన్ లేదేంటి జక్కన్నా?

మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.. రౌద్రం రణం రుధిరం. వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ సినిమా ఈసారి ఎలాగైనా..

RRR: రిలీజ్ డేట్ ఇచ్చినా ప్రమోషన్ లేదేంటి జక్కన్నా?

Rrr

RRR: మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.. రౌద్రం రణం రుధిరం. వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ సినిమా ఈసారి ఎలాగైనా వచ్చేస్తాం అంటూ ఓ ముహుర్తాన్ని కూడా ప్రకటించారు. ముందు మార్చి 18 లేదా ఏప్రిల్ 28 ఈ రెండు తేదీల్లో రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్.. మార్చి 25న ట్రిపుల్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుందని తెలిపారు.

RRR: 50 రోజుల్లో ఆర్ఆర్ఆర్.. పోస్టర్ తో కౌన్ డౌన్ స్టార్ట్!

మార్చి 25 అంటే నిండా మరో నెల రోజులే మిగిలింది. అయితే.. ఆర్ఆర్ఆర్ అండ్ టీం.. జక్కన్న అండ్ కో హడావుడి చేయడం లేదు. అప్పుడెప్పుడో ఇంకో యాభై రోజులలోనే విడుదల అంటూ ముందుగా సోషల్ మీడియాలో హంగామా మొదలు పెట్టిన ఆర్ఆర్ఆర్ టీం ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి రెండు వారాలు గడిచినా మరో అప్డేట్ లేదు. జనవరిలో విడుదల సందర్భంగా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం చుట్టేసిన టీం ఈసారి ఎందుకో అంతగా హుషారుగా కనిపించడం లేదు.

RRR: చరణ్-తారక్ లలో రాజమౌళికి ఇష్టమైన పాత్ర ఇదే!

కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక రెండు మూడు రోజులు హడావుడి కనిపించినా ఆ తర్వాత మాత్రం మధ్యలో ఎలాంటి అప్డేట్స్ లేవు. ప్రస్తుతం హీరోలిద్దరూ వాళ్ళ వాళ్ళ కొత్త సినిమాల పనిలో ఉన్నారు. అందుకే వాళ్ళు ప్రమోషన్ మొదలు పెట్టలేదు. అయితే వాళ్ళు ఎంట్రీ ఇచ్చేందుకు చాలా టైం ఉంది. కానీ ఈలోగా సోషల్ మీడియాలో ప్రచారం చేసేందుకు చాలా స్కోప్ ఉంది. కానీ.. ప్రస్తుతానికి అయితే సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు. అయితే మార్చ్ 9న, మార్చి 14న రెండు బిగ్ అప్డేట్స్ రాబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఆ అప్డేట్స్ ఏంటో.. అది ఎంతమేర సినిమా హైప్ పెంచుతాయో ఇంకా తెలియాల్సి ఉంది.