RRR: 50 రోజుల్లో ఆర్ఆర్ఆర్.. పోస్టర్ తో కౌన్ డౌన్ స్టార్ట్!

మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.. రౌద్రం రణం రుధిరం.

RRR: 50 రోజుల్లో ఆర్ఆర్ఆర్.. పోస్టర్ తో కౌన్ డౌన్ స్టార్ట్!

Rrr

RRR: మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.. రౌద్రం రణం రుధిరం. వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ సినిమా ఈసారి ఎలాగైనా వచ్చేస్తాం అంటూ ఓ ముహుర్తాన్ని కూడా ప్రకటించారు. ముందు మార్చి 18 లేదా ఏప్రిల్ 28 ఈ రెండు తేదీల్లో రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్.. మార్చి 25న ట్రిపుల్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుందని తెలిపారు.

Khiladi: హిందీలో ఖిలాడీ.. బాలీవుడ్‌లో మాస్ మహరాజ్ మూవీ రిలీజ్!

మార్చి 25 అంటే నిండా మరో యాభై రోజులే కదా. అందుకే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ముందుగా సోషల్ మీడియాలో హంగామా మొదలు పెట్టిన ఆర్ఆర్ఆర్ టీం ఓ పోస్టర్ రిలీజ్ చేసి. యాభై రోజుల కౌండ్ డౌన్ మొదలు పెట్టింది. జనవరిలో విడుదల సందర్భంగా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం చుట్టేసిన టీం ఈసారి ఎలా ప్లాన్ చేస్తుందో తెలియాల్సి ఉండగా ఇప్పుడైతే సోషల్ మీడియాలో మొదలు పెట్టేసింది.

Manirathnam : మణిరత్నం, శంకర్ మహదేవన్‌లకు భారత్‌ అస్మిత రాష్ట్రీయ పురస్కారం

తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో రామ్ చరణ్ గుఱ్ఱపు స్వారీ చేస్తూ, ఎన్టీఆర్ బుల్లెట్ ను నడుపుతూ కనిపించారు. ఇది గతంలో విడుదల చేసిన పోస్టర్ స్టిల్ అయినా ఇది.. షూటింగ్ చేస్తున్న సమయం నాటి ఫొటో కావడం అభిమానులను అట్రాక్ట్ చేస్తుంది. 50 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆర్ఆర్ఆర్ అంటూ ప్రేక్షకులను అలెర్ట్ చేసేలా వదిలిన ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.