Manirathnam : మణిరత్నం, శంకర్ మహదేవన్‌లకు భారత్‌ అస్మిత రాష్ట్రీయ పురస్కారం

పుణేకు చెందిన ఎంఐటీ వరల్డ్‌ పీస్‌ యూనివర్సిటీ గత 18 ఏళ్లుగా వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులను భారత్‌ అస్మిత రాష్ట్రీయ అవార్డులతో సత్కరిస్తోంది. ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని..........

Manirathnam : మణిరత్నం, శంకర్ మహదేవన్‌లకు భారత్‌ అస్మిత రాష్ట్రీయ పురస్కారం

Shankar Mahadevan

Shankar Mahadevan :  ప్రముఖ సినీదర్శకుడు మణిరత్నం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో క్లాసిక్ లాంటి సినిమాలని మనకి అందించారు. ఆయన ఒక్కో మూవీ ఒక్కో అద్భుతం. ఇప్పటికే ఆయన సినిమాలకు గాను పద్మశ్రీతో సహా అనేక అవార్డులు రివార్డులు అందుకున్నారు. తాజాగా మణిరత్నంకి సినిమాలకు చేసిన సేవలకు గాను భారత్‌ అస్మిత రాష్ట్రీయ పురస్కారం వరించింది.

పుణేకు చెందిన ఎంఐటీ వరల్డ్‌ పీస్‌ యూనివర్సిటీ గత 18 ఏళ్లుగా వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులను భారత్‌ అస్మిత రాష్ట్రీయ అవార్డులతో సత్కరిస్తోంది. ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని భారత్‌ అస్మిత్‌ ఫౌండేషన్‌ తో పాటు ఎంఐటీ స్కూల్‌ ఆఫ్‌ గవర్న్‌మెంట్‌ నిర్వాహకులు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సారి కూడా భారత్‌ అస్మిత రాష్ట్రీయ పురస్కారాన్ని పలువురు ప్రముఖులకు అందించనున్నారు. అందులో భాగంగా ఈసారి సినీరంగం తరపున దర్శకుడు మణిరత్నంకు ఈ అవార్డును ప్రకటించారు.

Bro Daddy : బాబాయి-అబ్బాయితో మలయాళం సూపర్ హిట్ ‘బ్రో డాడీ’ తెలుగు రీమేక్

అంతేకాక సినీ రంగం తరపున గాయకుడు శంకర్ మహదేవన్ కి కూడా ఈ అవార్డుని అందించనున్నారు. శంకర్ మహదేవన్ కూడా ఎంత గొప్ప గాయకుడో మన అందరికి తెలుసు. ఆయన కూడా పద్మశ్రీ అవార్డుతో సహా గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఎన్నో అవార్డులని అందుకున్నారు. తాజాగా ఈ భారత్‌ అస్మిత రాష్ట్రీయ పురస్కారం అందుకోబోతున్నారు. అయితే ఈ సారి కరోనా కారణంగా ఈ అవార్డుల వేడుకని వర్చువల్ గా నిర్వహించనున్నారు.