Bro Daddy : బాబాయి-అబ్బాయితో మలయాళం సూపర్ హిట్ ‘బ్రో డాడీ’ తెలుగు రీమేక్

మలయాళం స్టార్ హీరోలు మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ తండ్రి కొడుకులుగా నటించిన మల్టీస్టారర్ సినిమా 'బ్రో డాడీ'. ఈ సినిమా ఇటివల హాట్ స్టార్ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అయింది.....

Bro Daddy :  బాబాయి-అబ్బాయితో మలయాళం సూపర్ హిట్ ‘బ్రో డాడీ’ తెలుగు రీమేక్

Bro Daddy

Venkatesh – Rana :  ఇటివల మలయాళంలో మంచి మంచి సినిమాలు చాలా వస్తున్నాయి. మళయాళంలోనే కాక ఆ సినిమాలు ఓటీటీ ద్వారా దేశమంతటా మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. అన్ని భాషల్లోనూ మలయాళ సినిమాలకు ఆదరణ పెరుగుతుంది. తాజాగా మరో మలయాళ సినిమా ఓటీటీలో విజయం సాధించి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటుంది.

మలయాళం స్టార్ హీరోలు మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ తండ్రి కొడుకులుగా నటించిన మల్టీస్టారర్ సినిమా ‘బ్రో డాడీ’. ఈ సినిమా ఇటివల హాట్ స్టార్ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అయింది. ఫుల్ లెంగ్త్ కామెడీతో ఈ సినిమా అందర్నీ మెప్పిస్తుంది. పెళ్ళికాకుండా హీరోతో లివింగ్ రిలేషన్ లో ఉండి హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుంది. అదే సమయంలో హీరో తల్లి కూడా ప్రెగ్నెంట్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఎదుర్కున్న పరిస్థితులు, హీరో పెళ్లి ఎలా జరిగింది అనే కథాంశంతో సరదాగా తెరకెక్కించారు.

Puneeth Rajkumar : పునీత్ రాజకుమార్ ఫ్యామిలీని పరామర్శించడానికి బెంగుళూర్ పయనమైన అల్లు అర్జున్

ఈ సినిమాకి డైరెక్టర్ కూడా పృథ్విరాజ్ సుకుమారన్ కావడం విశేషం. హీరోగా, డైరెక్టర్ గా మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ స్టార్ హీరో. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు. ఇటివల నిర్మాత సురేష్ బాబు వేరే భాషల్లో మంచి విజయం సాధించిన సినిమాల రైట్స్ కొనేసి తెలుగులో రీమేక్ చేసి ఇక్కడ కూడా విజయం సాధిస్తున్నారు. దీంతో ‘బ్రో డాడీ’ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ని కూడా సురేష్ బాబు కొనుకున్నట్టు తెలుస్తుంది.

SSMB28 : త్రివిక్రమ్, మహేష్ సినిమా SSMB28 ముహూర్తం

రానా, వెంకటేష్ తో ‘బ్రో డాడి’ సినిమాని తెరకెక్కించాలి అనుకుంటున్నారు సురేశ్ బాబు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నెట్ ఫ్లిక్స్ కోసం ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ సిరీస్ తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘బ్రో డాడీ’ రీమేక్ ని మరింత హిలేరియస్ గా తీయాలి అని అనుకుంటున్నారు. ఇదే జరిగితే మరో రీమేక్ తెలుగులో రానున్నట్టే. ఇప్పటికే చాలా మంది ఓటీటీ ఉన్న తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని చూసేసారు. మరి దీని తెలుగు రీమేక్ ఎప్పుడూ వస్తుందో చూడాలి.