Puneeth Rajkumar : పునీత్ రాజకుమార్ ఫ్యామిలీని పరామర్శించడానికి బెంగుళూర్ పయనమైన అల్లు అర్జున్

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆకస్మిక మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు మాత్రమే కాదు కన్నడ ప్రజలకు కూడా తీరని లోటు. తాజాగా పునీత్..........

Puneeth Rajkumar : పునీత్ రాజకుమార్ ఫ్యామిలీని పరామర్శించడానికి బెంగుళూర్ పయనమైన అల్లు అర్జున్

Allu Arjun

Updated On : February 3, 2022 / 9:59 AM IST

 

Allu Arjun :  కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆకస్మిక మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు మాత్రమే కాదు కన్నడ ప్రజలకు కూడా తీరని లోటు. గతేడాది అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన మరణ వార్త విని ఆయన అభిమానులు, కన్నడ ప్రజలు, ఎంతో మంది ప్రముఖులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయన చేసిన ఎన్నో సేవలని గుర్తు చేసుకున్నారు.

ఆయన చివరి చూపు చూడటానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్.. లాంటి చాలా మంది స్టార్ హీరోలు, చాలా మంది నటి నటులు పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత బెంగళూర్ కి వెళ్లి ఆయనకి నివాళులు అర్పించారు. ఆ తర్వాత కూడా రామ్ చరణ్, మరి కొంతమంది నటులు ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు.

Pawan kalyan : ‘హరిహర వీరమల్లు’ యాక్షన్ సీన్స్ పై అప్‌డేట్

తాజాగా పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీని పరామర్శించడానికి అల్లు అర్జున్ బెంగుళూర్ కి వెళ్తున్నారు. ఇవాళ 10 గంటల 30 నిమిషాలకి హైదరాబాద్ నుండి అల్లు అర్జున్ బెంగళూరు వెళ్తారు. ముందుగా పునీత్ అన్న శివ రాజకుమార్ ని కలిసి పునీత్ కుటుంబసభ్యుల్ని పరామర్శించి ఆ తర్వాత పునీత్ సమాధిని సందర్శించి ఆయనకి నివాళులు అర్పించనున్నారు.