Bangarraju: సంక్రాంతికి వచ్చేస్తున్న సోగ్గాళ్లు.. అక్కినేని ఫ్యాన్స్‌లో భారీ ఆశలు!

తండ్రీ కొడుకులు సందడి చెయ్యడానికి రెడీ అయ్యారు. పెద్ద పండక్కి ధియేటర్లో పెద్ద హీరోల సందడి లేదనుకుంటున్న వాళ్లకి.. సోగ్గాళ్లు సంక్రాంతికి వస్తున్నారంటూ అనౌన్స్ చేశారు.

Bangarraju: సంక్రాంతికి వచ్చేస్తున్న సోగ్గాళ్లు.. అక్కినేని ఫ్యాన్స్‌లో భారీ ఆశలు!

Bangarraju

Bangarraju: తండ్రీ కొడుకులు సందడి చెయ్యడానికి రెడీ అయ్యారు. పెద్ద పండక్కి ధియేటర్లో పెద్ద హీరోల సందడి లేదనుకుంటున్న వాళ్లకి.. సోగ్గాళ్లు సంక్రాంతికి వస్తున్నారంటూ అనౌన్స్ చేశారు. సంక్రాంతికి కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న బంగార్రాజు.. బ్యాక్ టూ బ్యాక్ ఇంట్రస్టింగ్ వీడియోలతో సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో అప్పట్లో సూపర్ హిట్ కొట్టిన నాగచైతన్య.. ఇప్పుడు కొడుకు నాగచైతన్యతో కలిసి సంక్రాంతి సందడికి సిద్దమవుతున్నారు.

Sankranti Movies: హ్యండిచ్చిన స్టార్ హీరోలు.. థియేటర్లపై ఛోటా హీరోల దండయాత్ర!

సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్ గా వస్తున్న బంగార్రాజు సినిమా ప్రమోషన్ల దూకుడు పెంచింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్షన్లో.. ఇంట్రస్టింగ్ స్టార్ కాస్ట్ తో పండగ బరిలోకి దిగుతున్న బంగార్రాజు.. జనవరి 14న రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. ఆగస్ట్ లో మొదలుపెట్టిన బంగార్రాజు ఆఘమేఘాల మీద షూటింగ్ కంప్లీట్ చేసింది .పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా సంక్రాంతి సందడికి రెడీ అవుతోంది. నాగచైతన్య, నాగార్జున హీరోలుగా వస్తున్న ఈసినిమా మీద ఇప్పటికే విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా, ఫారియా స్పెషల్ సాంగ్ ఎట్రాక్షన్ తో సినిమా అంచనాల్ని పెంచేస్తోంది.

VinaroBhagyamuVishnuKatha: కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్ టైటిల్!

కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో.. అన్నపూర్ణ ప్రొడక్షన్స్ లో తెరకెక్కుతూ సంక్రాంతి బరిలోకి దిగుతున్న బంగార్రాజు ప్రమోషన్లు స్టార్ట్ చేశాడు. నాగార్జున లుక్ తోనే సినిమా మీద క్రేజ్ క్రియేట్ చేసిన బంగార్రాజు టీమ్.. నాగచైతన్యని కూడా కంప్లీట్ విలేజ్ బాయ్ గా చూపించబోతున్నారు. మాస్ యాంగిల్ తో పాటు ఆ పల్లెటూరి లుక్.. నాగచైతన్యకు బాగా సూట్ అయ్యిందని, ఈ మాస్ అప్పీల్ విషయంలో తండ్రిని మ్యాచ్ చేసేలానే ఉన్నాడని ఫుల్ ఖుష్ అవుతున్నారు అక్కినేని ఫ్యాన్స్.