Sankranti Movies: హ్యండిచ్చిన స్టార్ హీరోలు.. థియేటర్లపై ఛోటా హీరోల దండయాత్ర!

ఈ సారి 6 గురు స్టార్ హీరోల సినిమాలతో సంక్రాంతి సంబరాలు అబ్బో అదుర్స్ అనుకున్నారు అందరూ. కానీ కోవిడ్ దెబ్బకి సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. ఆఖరి ఆశగా ఉన్న రాధేశ్యామ్ కూడా..

Sankranti Movies: హ్యండిచ్చిన స్టార్ హీరోలు.. థియేటర్లపై ఛోటా హీరోల దండయాత్ర!

Sankranti Release

Sankranti Movies: ఈ సారి 6 గురు స్టార్ హీరోల సినిమాలతో సంక్రాంతి సంబరాలు అబ్బో అదుర్స్ అనుకున్నారు అందరూ. కానీ కోవిడ్ దెబ్బకి సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. ఆఖరి ఆశగా ఉన్న రాధేశ్యామ్ కూడా పోస్ట్ పోన్ అని అనౌన్స్ చెయ్యడంతో.. ఒక్క పెద్ద సినిమా కూడా లేకుండానే ఈ సారి సంక్రాంతి సీజన్ గడిచిపోతోంది. సంక్రాంతికి వస్తారని వెయ్యి కళ్లతో ఎదురుచూసిన స్టార్లు రాకపోగా.. అనుకోని అతిధులుగా చిన్న హీరోల సినిమాలు సడెన్ గా లైన్లోకొచ్చేశాయి. సంక్రాంతికి వస్తాయనుకున్న పెద్ద సినిమాలన్నీ ఆగిపోయాయి. పోయిన సంక్రాంతికి పెద్ద సినిమాలు లేకపోయినా.. ఈ సంవత్సరం స్టార్ హీరోల సినిమాలతో సంక్రాంతి సూపర్ హిట్ అనుకన్నారు అందరూ.

83 Movie: కమర్షియల్ అట్టర్ ప్లాప్ ’83’.. స్పోర్ట్స్ డ్రామాల పనైపోయినట్లేనా?

కానీ.. అనుకోకుండా వచ్చిన కోవిడ్ తో అన్నీ తలకిందులైపోయాయి. అందరికంటే ముందు సర్కారు వారి పాటతో సంక్రాంతి ఖర్చీఫ్ వేసుకున్న మహేష్ బాబు.. ఉన్న సినిమాలకు అడ్డం పడటం ఎందుకుని సైలెంట్ గా ఏప్రిల్ కి పోస్ట్ పోన్ చేసుకున్నారు. మహేష్ రాకపోయినా.. ట్రిపుల్ఆర్, భీమ్లానాయక్, రాధేశ్యామ్ లాంటి పెద్ద సినిమాలతో పండగ సంబరాలు చేస్కుందాం అనుకున్న ఫాన్స్ కి ఆ ఆశ కూడా మిగల్లేదు. ట్రిపుల్ ఆర్, రాదేశ్యామ్ అడగడంతో పవన్ కళ్యాణ్ కూడా పండగబరినుంచి తప్పుకున్నారు. ఇక మిగిలింది ట్రిపుల్ఆర్, రాదేశ్యామ్ అనుకున్నారు. ఎట్టి పరిస్తితుల్లో సినిమా జనవరి 7న రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యి పీక్స్ లో ప్రమోషన్లు చేసిన ట్రిపుల్ ఆర్ రిలీజ్ కి వారం ముందు ఈ పరిస్తితుల్లో సినిమా రిలీజ్ చెయ్యలేమని చేతులెత్తేసింది.

Krithi Shetty: 6 నెలల్లో 5 సినిమాలు.. బేబమ్మ బిజీబిజీ!

ట్రిపుల్ఆర్ పోస్ట్ పోన్ అయ్యింది కదా.. మిగిలున్న ప్రభాస్ అయినా పండగ సందడి మిగులుస్తాడేమో అనుకుంటే.. ఆ కోరిక కూడా తీరడం లేదు ఫాన్స్ కి. నిన్నటి వరకూ రిలీజ్ విషయంలో తగ్గేదే లే అని చెప్పిన రాదేశ్యామ్ టీమ్.. సినిమా పోస్ట్ పోన్ చేస్తున్నామని చావుకబురు చల్లగా చెప్పింది. దాంతో పండక్కి వస్తారనుకున్న స్టార్ హీరోలు ఈ సారి హ్యాండిచ్చారు. పండక్కి వస్తారనుకన్న పెద్ద హీరోలు రాకపోవడంతో చిన్నసినిమాలు, చిన్న హీరోలు ధియేటర్ల మీద దండయాత్ర చేస్తున్నారు. స్టార్ హీరోలు రాకపోవడంతో సంక్రాంతి సీజన్ మిస్ చేస్కోవడం ఎందుకుని.. సడెన్ గా సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసేస్తున్నారు చిన్న హీరోలు. నాగార్జున, నాగచైతన్య బంగార్రాజు సినిమా ఈ సారి పండక్కి కాస్తో కూస్తో.. సందడికి రెడీ అవుతోంది.

VinaroBhagyamuVishnuKatha: కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్ టైటిల్!

అందరిలోకి ముందుగా ఆదిసాయికుమార్ అతిధి దేవో భవ సినిమా జనవరి 7న సీజన్ లోనే ఫస్ట్ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన డి.జె టిల్లు జనవరి 14న రిలీజ్ అవుతోంది. అశోక్ గల్లా హీరోగా తెరకెక్కిన హీరో మూవీ కూడా సంక్రాంతి రేస్ లో కే వచ్చేసింది. సెవనె డేట్, సిక్స్ నైట్స్ అనే ఇంట్రస్టింగ్ మూవీతో పాటు.. డిసెంబర్ 31 అని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రానా 1945 కూడా డేట్ పోస్ట్ పోన్ చేసుకుని సంక్రాంతి కే రిలీజ్ అవుతోంది.

S.Thaman: టాలీవుడ్‌లో కరోనా కలకలం.. థమన్‌కి పాజిటివ్!

ఇక దిల్ రాజు వారసుడు అశిష్ కూడా.. రౌడీ బాయ్స్ మూవీతో సంక్రాంతికే తన అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుంటున్నాడు. అసలు ఈమధ్య న్యూస్ లో కూడా లేని చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి మూవీ పెద్ద పండక్కే రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాడు. వీళ్లతో పాటు రాజశేఖర్ లీడ్ రోల్ చేస్తున్న శేఖర్ మూవీ కూడా సంక్రాంతికే వస్తోంది. సందడి చేస్తారనుకున్న స్టార్ హీరోలు సైడైపోవడంతో చిన్న సినిమాలతోనే ఈ సారి సంక్రాంతి సరిపెట్టుకోవాల్సి వస్తోందంటున్నారు ఫాన్స్.