S.Thaman: టాలీవుడ్‌లో కరోనా కలకలం.. థమన్‌కి పాజిటివ్!

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ గుబులు పుట్టిస్తుంది. సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డుతుండ‌డం అందరిలో ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఒక్కొక్కరుగా మళ్ళీ కరోనా సోకినట్లుగా..

S.Thaman: టాలీవుడ్‌లో కరోనా కలకలం.. థమన్‌కి పాజిటివ్!

S.Thaman: క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ గుబులు పుట్టిస్తుంది. సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డుతుండ‌డం అందరిలో ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఒక్కొక్కరుగా మళ్ళీ కరోనా సోకినట్లుగా నిర్ధారిస్తుంటే తెలుగు సినీ పరిశ్రమలో కలవరం మొదలవుతుంది. రీసెంట్‌గా మ‌హేష్ క‌రోనా బారిన పడగా.. మంచు మనోజ్, మంచు ల‌క్ష్మీ, విశ్వ‌క్ సేన్, హీరో నితిన్ భార్య, వరలక్ష్మి శరత్ కుమార్ సహా మరికొందరికి కూడా పాజిటివ్ గా నిర్ధారణయింది.

Dhanush : షూట్ మొదలు పెట్టిన ‘సార్’

తాజాగా సంగీత దర్శకుడు థమన్ కు కూడా కరోనా సోకినట్లు నిర్ధారణయింది. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని తమన్‌ సూచించారు. థ‌మ‌న్ ఆరోగ్యం ప్ర‌స్తుతం నిలకడగానే ఉండగా హోం ఐసోలేష‌న్‌లో ఉన్నాడ‌ని తెలుస్తుంది. థ‌మ‌న్‌కి క‌రోనా అని తెలిసిన వెంట‌నే ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు, అభిమానులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ట్వీట్స్ చేస్తున్నారు.

Varalxmi Srathkumar : తెలుగు తెరపై కొత్త లేడీ విలన్.. వరుస సినిమాలతో బిజీ బిజీ..

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్న సమయంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా కోవిడ్‌ బారిన పడుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండగా సెలబ్రిటీలు ఫ్యామిలీలకు ఫ్యామిలీలు కరోనా మహమ్మారికి చిక్కి విలవిలాడుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తుండగా.. సంతోషకరమైన విషయం ఏమిటంటే గతంతో పోలిస్తే డెత్ రేట్ తక్కువగా ఉండడం. అయితే, నిర్లక్ష్యం వదిలేసి అందరూ జాగ్రత్తగా ఉంటేనే మహమ్మారి నుండి బయటపడగలిగేది.