83 Movie: కమర్షియల్ అట్టర్ ప్లాప్ ’83’.. స్పోర్ట్స్ డ్రామాల పనైపోయినట్లేనా?

సినిమా సూపర్ గా ఉంది.. సినిమా హార్ట్ ని టచ్ చేసింది.. ఎమోషనల్ గా అదిరిపోయింది.. ఇవన్నీ 83 సినిమా చూసినవాళ్లు రాసిన రివ్యూస్. ఇలాంటి రివ్యూస్ తప్పించి.. సినిమా సాధించింది ఏంటి అంటే…

83 Movie: కమర్షియల్ అట్టర్ ప్లాప్ ’83’.. స్పోర్ట్స్ డ్రామాల పనైపోయినట్లేనా?

83 Movie

83 Movie: సినిమా సూపర్ గా ఉంది.. సినిమా హార్ట్ ని టచ్ చేసింది.. ఎమోషనల్ గా అదిరిపోయింది.. ఇవన్నీ 83 సినిమా చూసినవాళ్లు రాసిన రివ్యూస్. ఇలాంటి రివ్యూస్ తప్పించి.. సినిమా సాధించింది ఏంటి అంటే… షారూఖ్ ఖాన్ జీరో సినిమా కంటే తక్కువ కలెక్షన్లు అని చెప్పొచ్చు. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా 83 ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ అయినా.. కలెక్షన్లు మాత్రం సాధించలేకపోతోంది. బాలీవుడ్ లో స్పోర్ట్స్ డ్రామాల పని అయిపోయినట్టేనా అనిపించేలా ఉంది 83 సినిమా రిజల్ట్.

Krithi Shetty: 6 నెలల్లో 5 సినిమాలు.. బేబమ్మ బిజీబిజీ!

2021లో మోస్ట్ అవెయిటెడ్ బాలీవుడ్ మూవీ 83. రణవీర్ సింగ్, దీపికా పడుకోన్ జంటగా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ వెయిట్ చేశారు. డిసెంబర్ 24న రిలీజ్ అయ్యిన 83 చూసి సెలబ్రిటీలు, క్రిటిక్స్ తో సహా అందరూ తెగ మెచ్చుకున్నారు. అయితే ఇవేం బాక్సాఫీస్ కలెక్షన్లను తెచ్చిపెట్టలేకపోయాయి. రిలీజ్ అయ్యి 3 వారాలవుతున్నా ఇంకా చెప్పుకోదగ్గ కలెక్షన్లుతెచ్చుకోలేదు 83. ఎమోషనల్ గా అందర్నీ ఎట్రాక్ట్ చేసిన 83.. 2018లో వచ్చిన షారూఖ్ ఖాన్ జీరో సినిమా కంటే కూడా ఎక్కువ కలెక్షన్లు తెచ్చుకోలేకపోయింది.

VinaroBhagyamuVishnuKatha: కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్ టైటిల్!

రణవీర్ సింగ్ ఎంతో ప్రెస్టీజియస్ గా చేసిన ఈ స్పోర్ట్స్ డ్రామా వరల్డ్ వైడ్ గా జస్ట్ 106 కోట్లు మాత్రమే సంపాదించింది. ధియేటర్లో ఆడియన్స్ చేత స్టాండింగ్ ఒవేషన్ సంపాదించిన ఈ సినిమా కలెక్షన్లు మాత్రం సంపాదించలేకపోయింది. క్రికెట్ హీరోలుగా ధోనీ, కోహ్లిని తప్ప మిగతా వాళ్లని పెద్దగా కన్సిడర్ చెయ్యని యంగ్ జనరేషన్ ని 1983 నాటి క్రికెటర్లను అంతగా ఐడెంటిఫై చెయ్యలేకపోయింది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఎమోషనల్ గా తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా రిజల్ట్ చూసి ఇక పై బాలీవుడ్ స్పోర్ట్స్ డ్రామా చెయ్యాలంటే ఆలోచించాల్సిందే అనుకుంటున్నారు.