Krithi Shetty: 6 నెలల్లో 5 సినిమాలు.. బేబమ్మ బిజీబిజీ!

ఒక్క సినిమా ఈ హీరోయిన్ కెరీర్ నే మార్చేసింది. ఉప్పెనలా అవకాశాలతో ముంచెత్తుతోంది. ప్రజెంట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన కన్నడ హీరోయిన్ కృతి శెట్టి వరస సినిమాలతో బిజీగా ఉంది.

Krithi Shetty: 6 నెలల్లో 5 సినిమాలు.. బేబమ్మ బిజీబిజీ!

Krithi Shetty

Krithi Shetty: ఒక్క సినిమా ఈ హీరోయిన్ కెరీర్ నే మార్చేసింది. ఉప్పెనలా అవకాశాలతో ముంచెత్తుతోంది. ప్రజెంట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన కన్నడ హీరోయిన్ కృతి శెట్టి వరస సినిమాలతో బిజీగా ఉంది. అంతే కాదు.. 6 నెలల్లో 5 సినిమాల రిలీజ్ లతో.. ఫాన్స్ కి బ్యాక్ టూ బ్యాక్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్లాన్ చేసింది బేబమ్మ. ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా ఓవర్ నైట్ స్టార్ ని చేసేసింది. అందాలు ఆరబోస్తూ.. అవకాశాల కోసం ఆపసోపాలు పడుతున్న హీరోయిన్లు ఉన్న ఈ టైమ్ లో అభినయంతో అందరినీ ఎట్రాక్ట్ చేసి ఉప్పెన లాంటి అవకాశాలతో వరుసగా 5సినిమాల్లో ఆఫర్లు కొట్టేసింది.

VinaroBhagyamuVishnuKatha: కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్ టైటిల్!

అంతేకాదు.. ఈ సీజన్ లో ఎవరికీ లేనన్ని ఎక్కువ రిలీజ్ లతో ఫాన్స్ కి ఫీస్ట్ ప్లాన్ చేసింది కృతి శెట్టి. క్రిస్ మస్ కానుకగా రిలీజ్ అయిన నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో కాస్త గ్లామరస్ గానే కనిపించి నేను ట్రెండ్ ని ఫాలో అవుతాను అంటూ హింట్ ఇచ్చింది కృతి. నానితో పెయిర్ అయిన ఈ ముద్దుగుమ్మ.. యాక్టింగ్ తో మంచి పేరే తెచ్చుకుంది. ఈ సినిమా రిలీజ్ అయిన వన్ మన్త్ గ్యాప్ కూడా లేకుండానే బంగార్రాజుతో కలిసి సంక్రాంతికి వస్తోంది బేబమ్మ. నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన బంగార్రాజు సినిమాలో ఊరి ప్రెసిడెంట్ గా క్యూట్ రోల్ ప్లే చేస్తోంది కృతి శెట్టి.

S.Thaman: టాలీవుడ్‌లో కరోనా కలకలం.. థమన్‌కి పాజిటివ్!

బంగార్రాజు తర్వాత మళ్లీ మూడో సినిమా సుధీర్ బాబుతో నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రిలీజ్ అవుతోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో వస్తున్న ఈ క్రేజీ మూవీ ఫిబ్రవరిలో గానీ, మార్చిలో కానీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక నితిన్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న మాచర్ల నియోజకవర్గం మూవీ ఇప్పటికే ఏప్రిల్ కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మరో హీరో రామ్-లింగుస్వామి కాంబినేషన్లో చేస్తున్న సినిమా కూడా సమ్మర్ కి రిలీజ్ రెడీ చేసుకుంటోంది. ఇలా 6 నెలల్లో 5 సినిమాలతో ఆడియన్స్ కి బ్యాక్ టూ బ్యాక్ విజువల్ ట్రీట్ ప్లాన్ చేసింది కృతి శెట్టి.