Bangarraju : ‘బంగార్రాజు’ ల బాక్సాఫీస్ ర్యాంపేజ్! 50 కోట్ల క్లబ్‌లో..

అక్కినేని తండ్రీ కొడుకులు బాక్సాఫీస్‌ను ర్యాంప్ ఆడేస్తున్నారు..

Bangarraju : ‘బంగార్రాజు’ ల బాక్సాఫీస్ ర్యాంపేజ్! 50 కోట్ల క్లబ్‌లో..

Bangarraju Collections

Bangarraju: కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి బాక్సాఫీస్ బరిలో సందడి చేస్తున్నారు. అన్నపూర్ణ బ్యానర్ మీద నిర్మిస్తూ.. తనయుడు చైతో కలిసి నాగ్ నటించిన సినిమా ‘బంగార్రాజు – సోగ్గాడు మళ్లీ వచ్చాడు’.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకిది ప్రీక్వెల్. అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీని కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్ట్ చేశారు.

Bangarraju : వాసి వాడి తస్సాదియ్యా.. రెండు రోజుల్లో రచ్చ లేపారుగా!

సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కినేని ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అసలు సిసలు పండుగ సినిమా ‘బంగార్రాజు’ అని ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలవారు డిసైడ్ చేసేశారు. అందుకు తగ్గట్లే అక్కినేని తండ్రీ కొడుకులు బాక్సాఫీస్‌ను ర్యాంప్ ఆడేస్తున్నారు.

Laddunda Song : ‘లగెత్తి కొడితే లడ్డుండా.. లడ్డుండా’ – నాగ్ భలే పాడాడుగా!

ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ. 17 కోట్లుకు పైగా గ్రాస్ వసూలు చేసిన ‘బంగార్రాజు’ రెండో రోజు అంతకు డబుల్ రూ. 36 కోట్ల గ్రాస్ రాబట్టింది. మూడో రోజుతో సక్సెస్‌ఫుల్‌గా రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరిపోయి బ్రేక్ ఈవెన్‌కి అయిపోయింది. ‘బంగార్రాజు’ బయ్యర్లు, ఎగ్జిబిటర్లందరూ లాభాల బాటపట్టారు.

నాగార్జునకి 3వది.. చైతన్యకి 4వది..
50 కోట్ల క్లబ్‌తో ఈ సినిమాతో నాగ్ హ్యాట్రిక్ కొట్టారు..
‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘ఊపిరి’ తర్వాత 50 కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమా ‘బంగార్రాజు’..
‘మజిలీ’, ‘వెంకీమామ’, ‘లవ్ స్టోరీ’  తర్వాత చైతన్య ‘బంగార్రాజు’ తో 50 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం.

ఈస్ట్‌లో నాన్ ‘బాహుబలి’ రికార్డ్..
‘బంగార్రాజు’ తో అక్కినేని తండ్రీ కొడుకులు సరికొత్త రికార్డ్ సాధించారు.
టాప్ 5 డే 3 షేర్స్..
బాహుబలి 2 – రూ.1.41 కోట్లు
బంగార్రాజు – రూ.86 లక్షలు
అల వైకుంఠపురములో – రూ.836 లక్షలు
బాహుబలి – రూ.80 లక్షలు
రంగస్థలం – రూ. 77 లక్షలు