Laddunda Song : ‘లగెత్తి కొడితే లడ్డుండా.. లడ్డుండా’ – నాగ్ భలే పాడాడుగా!

‘చెరుకు తోటలో చారెడు బియ్యం.. వంగ తోటలో మరదలి కయ్యం.. లగెత్తి కొడితే లడ్డుండా.. లడ్డుండా’..

Laddunda Song : ‘లగెత్తి కొడితే లడ్డుండా.. లడ్డుండా’ – నాగ్ భలే పాడాడుగా!

Laddunda

Laddunda Song: కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటిస్తున్న క్రేజీ ఫిలిం ‘బంగార్రాజు – సోగ్గాడు మళ్లీ వచ్చాడు’.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ కి ప్రీక్వెల్‌గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బంగార్రాజు’ లో రమ్యకృష్ణ, కృతి శెట్టి ఫీమేల్ లీడ్స్‌గా నటిస్తున్నారు. జీ5 సంస్థతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నాగార్జున నిర్మిస్తున్నారు.

Jr NTR : సీనియర్ ఫ్యాన్‌తో జూనియర్..

నవంబర్ 9న ఉదయం 9:09 గంటలకు ‘బంగార్రాజు’ ఆల్బమ్‌లోని ‘లడ్డుండా’ అనే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట సాకి ‘కింగ్’ నాగార్జున పాడారు. ‘బాబూ.. తబలా.. అబ్బాయ్ ఆర్మనీ.. చెరుకు తోటలో చారెడు బియ్యం.. వంగ తోటలో మరదలి కయ్యం.. లగెత్తి కొడితే లడ్డుండా.. లడ్డుండా’ అంటూ సాంగ్ ఎత్తుకున్న నాగ్ మంచి ఎనర్జిటిక్‌గా పాడారు.

Unstoppable : సెల్ఫ్‌మేడ్‌కి సర్‌నేమ్ నాని.. ఇది చిన్న శాంపిల్ మాత్రమే..

ధనుంజయ్, మోహనా భోగరాజు, నుతనా మోహన్, హరిప్రియ కూడా గొంతు కలిపారు. స్వర్గంలో ‘బంగార్రాజు’ రంభ, ఊర్వశి, మేనకలతో కలిసి ఈ పాటలో స్టెప్స్ ఇరగదీసాడు. అనూప్ రూబెన్స్ సంగీతమందించగా, భాస్కరభట్ల లిరిక్స్ రాశారు.