Bangarraju : సంక్రాంతి బరిలో ‘బంగార్రాజు’.. వాసివాడి తస్సాదియ్యా ‘బంగార్రాజు’ టీజర్ అదిరిందిగా

కొద్ది క్షణాల క్రితమే విడుదల అయిన బంగార్రాజు టీజర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ చూస్తుంటే 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాని మించి ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇందులో........

Bangarraju : సంక్రాంతి బరిలో ‘బంగార్రాజు’.. వాసివాడి తస్సాదియ్యా ‘బంగార్రాజు’ టీజర్ అదిరిందిగా

Bangarraju (1)

Bangarraju :  కింగ్ నాగార్జున నుంచి గతంలో వచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సోగ్గాడే చిన్నినాయనా’ మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ సినిమా రాబోతుంది. ఇందులో నాగార్జున, రమ్యకృష్ణతో పాటు నాగచైతన్య, కృతిశెట్టిలు కూడా జంటగా నటిస్తున్నారు. ఇన్ని రోజులు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురు చూశారు. ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా ‘బంగార్రాజు’ సినిమా టీజర్ రిలీజ్ చేయడంతో పాటు సినిమా రిలీజ్ ని కూడా అనౌన్స్ చేశారు.

కొద్ది క్షణాల క్రితమే విడుదల అయిన బంగార్రాజు టీజర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ చూస్తుంటే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాని మించి ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇందులో కామెడీ, రొమాంటిక్ సన్నివేశాలే కాక యాక్షన్, డివోషనల్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తుంది. నాగ చైతన్య కూడా తండ్రి లాంటి క్యారెక్టర్ తో అదరగొట్టేసాడు. ఇక మన బేబమ్మ తన అందంతో పాటు నటనతో కూడా ఆకట్టుకుంటుంది అని అర్ధమవుతుంది. ఇందులో కృతిశెట్టి ఊరి సర్పంచ్ గా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే నాగార్జునకి, నాగ చైతన్యకి మధ్య ఉన్న సంబంధం ఏంటో మాత్రం టీజర్ లో రివీల్ చేయలేదు.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి వాయిదా.. 

ఇక ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఇప్పటికే సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలని అనౌన్స్ చేశారు. అయితే అవి ఫ్యాన్స్ సినిమాలు. అంతే కాక కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని చోట్ల 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తుండటం వల్ల ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడే ఛాన్స్ ఉంది. దీంతో ‘బంగార్రాజు’ రిలీజ్ కి సిద్ధమైపోయింది. అయినా బంగార్రాజుకి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి బంగార్రాజు సినిమానే చూస్తారని ఆశిస్తున్నారు చిత్ర యూనిట్. ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ‘బంగార్రాజు’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. అయితే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం అని ప్రకటించారు కానీ ఏ డేట్ లో రిలీజ్ చేస్తారనేది మాత్రం చెప్పలేదు.