RRR : ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి వాయిదా..

రోజు రోజుకి దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ని అనౌన్స్ చేశారు. ఢిల్లీ లో ఇప్పటికే లాక్ డౌన్ ని అనౌన్స్ చేసి థియేటర్స్ ని మూసేసారు.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి వాయిదా..

Rrr

RRR :  రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నవంబర్ 2018లో ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టారు. షూటింగ్ అయిపోవచ్చిందనుకున్న సమయంలో కరోనా వచ్చి బ్రేక్ వేసింది. ఆ తర్వాత మొదటి వేవ్ అయ్యాక మిగిలిన షూటింగ్ ని పూర్తి చేశారు చిత్ర యూనిట్. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవలే ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ మరోసారి ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది.

ఇప్పటికే ఈ సినిమాని 30 జూలై 2020, 8 జనవరి 2021, 13 అక్టోబర్ 2021 డేట్స్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత 7 జనవరి 2022 రోజు రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రమోషన్స్ ని పీక్స్ లో చేస్తున్నారు. కానీ మరోసారి కరోనా కారణంగా ట్రిపుల్ ఆర్ సినిమా వాయిదా పడనుంది.

Vijay Sethupathi : విజయ్ సేతుపతి అంకిత భావం.. క్యాలెండర్ పై ఫోటోల కోసం మేకప్‌కి 45 నిమిషాలు..

ఇప్పటికే రోజు రోజుకి దేశంలో కరోనా కేసులు, ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ని అనౌన్స్ చేశారు. ఢిల్లీ లో ఇప్పటికే లాక్ డౌన్ ని అనౌన్స్ చేసి థియేటర్స్ ని మూసేసారు. మహారాష్ట్ర, కర్ణాటక లాంటి మరికొన్ని రాష్ట్రాల్లో 50 శాతంతో థియేటర్స్ ని నడపాలని సూచించారు. అంతే కాక నైట్ టైం లాక్ డౌన్ ని కూడా పెట్టారు. తెలంగాణాలో కూడా 50 శాతంతో థియేటర్స్ నడపమనే ఆదేశాలు త్వరలో ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. మరో పక్క ఏపీలో సినిమా టికెట్ రేట్ల విషయం ఇంకా తేలలేదు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది.

Shannu Deepu : షణ్ముఖ్‌కి బ్రేకప్.. సోషల్ మీడియాలో దీప్తి సునైనా పోస్ట్.. షాక్‌లో అభిమానులు

450 కోట్లు బడ్జెట్ పెట్టి తీసిన సినిమా ఇలాంటి టైంలో రిలీజ్ చేస్తే కలెక్షన్స్ రావడం కష్టమని చిత్ర బృందం గ్రహించారు. దాదాపు 1000 కోట్ల కలెక్షన్ ని టార్గెట్ పెట్టుకొని బరిలో దిగిన ‘ఆర్ఆర్ఆర్’కి మరోసారి కరోనా దెబ్బ పడటంతో వాయిదా వేస్తున్నట్టు సమాచారం. దేశంలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షల నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలని ప్రస్తుతానికి వాయిదా వేసి 2022 ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం. అయితే దీనిపై ‘ఆర్ఆర్ఆర్’ సినిమా యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.