Bappi Lahiri : బప్పీ లహరి బయోపిక్.. హీరోగా రణవీర్ సింగ్??

బాలీవుడ్ లో బయోపిక్ లు ఎక్కువగా తీస్తూ ఉంటారు. ఇదే కోవలో గతంలోనే బప్పీ లహరి బయోపిక్ తెరకెక్కించాలనుకున్నారు. గతంలో బప్పీ లహరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవిత కథను బయోపిక్.....

Bappi Lahiri :  బప్పీ లహరి బయోపిక్.. హీరోగా రణవీర్ సింగ్??

Ranaveer

Bappi Lahiri :  బాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, గాయకుడు బప్పీ లహరి మంగళవారం రాత్రి కన్నుమూశారు. బాలీవుడ్ లోనే కాక తెలుగు, మరికొన్ని భాషల్లో కూడా చాలా చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని క్రిటీ కేర్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటూనే బప్పీ లహిరి మంగళవారం రాత్రి మరణించారు. బప్పి లహరి మృతిపై బాలీవుడ్, టాలీవుడ్ తో సహా దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

బాలీవుడ్ లో బయోపిక్ లు ఎక్కువగా తీస్తూ ఉంటారు. ఇదే కోవలో గతంలోనే బప్పీ లహరి బయోపిక్ తెరకెక్కించాలనుకున్నారు. గతంలో బప్పీ లహరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవిత కథను బయోపిక్ తీయడానికి చాలామంది సంప్రదించారని, దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఒకవేళ తన బయోపిక్ తీస్తే తాను యువకుడిగా ఉన్నప్పటి పాత్రని బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ పోషిస్తే బాగుంటుందని తెలిపారు.

Aliya Bhat : సినిమా కోసం నా తల్లిని వేశ్యగా మార్చారు.. ‘గంగూబాయి కతియావాడీ’ సినిమాపై తనయుడి ఆవేదన

అయితే ఈ ప్రాజెక్టు ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఆయన మరణించడంతో బాలీవుడ్ నిర్మాణ సంస్థలు బప్పీ లహరి బయోపిక్ తెరకెక్కించడానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. మరి ఇందులో బప్పీ లహరి ఆశించినట్లు రణవీర్ సింగ్ హీరోగా నటిస్తారా లేక వేరే ఎవరైనా నటిస్తారా చూడాలి. త్వరలోనే బప్పీ లహరి బయోపిక్ ని కచ్చితంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.