Aliya Bhat : సినిమా కోసం నా తల్లిని వేశ్యగా మార్చారు.. ‘గంగూబాయి కతియావాడీ’ సినిమాపై తనయుడి ఆవేదన

‘గంగూబాయి కతియావాడీ’ సినిమాపై గంగూబాయి తనయుడు ఫైర్ అయ్యాడు. గత ఏడాది ‘గంగూబాయి కతియావాడీ’ చిత్రంపై గంగూబాయి తనయుడు బాబూ రావుజీ షా పిటిషన్ దాఖలు చేయడంతో ముంబయి కోర్టు..........

Aliya Bhat : సినిమా కోసం నా తల్లిని వేశ్యగా మార్చారు.. ‘గంగూబాయి కతియావాడీ’ సినిమాపై తనయుడి ఆవేదన

Gangubai

Gangubai Kathiawadi :  బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ అలియా భట్‌ నటించిన ‘గంగూబాయి కతియావాడీ’ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. ఇటీవలే సినిమా ట్రైలర్‌ విడుదలై ప్రజాదరణ పొందింది. ముంబయిలోని మాఫియా క్వీన్‌ గంగూబాయి జీవితం ఆధారంగా సంజయ్‌ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సెక్స్ వర్కర్ గా జీవితం మొదలు పెట్టాల్సి వచ్చి వాటన్నిటిని ఎదుర్కొని మాఫియా డాన్ గా ఎదిగిన గంగూబాయి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

అయితే ‘గంగూబాయి కతియావాడీ’ సినిమాపై గంగూబాయి తనయుడు ఫైర్ అయ్యాడు. గత ఏడాది ‘గంగూబాయి కతియావాడీ’ చిత్రంపై గంగూబాయి తనయుడు బాబూ రావుజీ షా పిటిషన్ దాఖలు చేయడంతో ముంబయి కోర్టు సంజయ్ లీలా భన్సాలీ, అలియా భట్‌లకు సమన్లు ​జారీ చేసింది. ఆ తర్వాత సినిమా విడుదలపై స్టే విధించేందుకు ముంబయి హైకోర్టు నిరాకరించింది. ఈ చిత్ర నిర్మాతలపై క్రిమినల్, పరువు నష్టం కేసులపై మధ్యంతర స్టే ఇచ్చింది హైకోర్టు. ఇప్పుడు ఈ కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అయినా సినిమా రిలీజ్ కి సిద్ధం చేసేశారు. దీంతో గంగూబాయి కుటుంబం, ఆమె దత్తపుత్రుడు బాబు రావుజీ షా, ఆమె మనవరాలు భారతి ఈ సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబు రావుజి షా మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

RC 15 : అవి షేర్ చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు

ఈ ఇంటర్వ్యూలో బాబూ రావుజీ షా మాట్లాడుతూ.. ”మీ సినిమా కోసం నా తల్లిని వేశ్యగా మార్చారు.ఇప్పుడు అనేకమంది మీ అమ్మ అసలు వేశ్యనా లేదా సామాజిక కార్యకర్తనా అంటూ అవమానిస్తున్నారు. ఇలాంటి మాటలు మమ్మల్ని చాలా బాధిస్తున్నాయి. మా కుటుంబ మానసిక స్థితి బాగాలేదు. అమ్మగురించి అలాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం.’’ అని అన్నారు.

Bappi Lahiri : అల్లరి నరేష్, రవితేజ కోసం తెలుగులో కంబ్యాక్.. బప్పీ లహరి తెలుగులో పాడిన చివరి పాట ఇదే..

ఇక గంగూబాయి మనవరాలు మాట్లాడుతూ.. ”డబ్బు కోసం మా కుటుంబం పరువు తీశారు. ఈ ప్రాజెక్ట్‌ తీసేటప్పుడు మా కుటుంబం అనుమతి అడగలేదు. వారు పుస్తకం రాసేటప్పుడు కూడా మా దగ్గరికీ రాలేదు. సినిమా తీయడానికి ముందు మా అనుమతి కావాల్సిందే. మా అమ్మమ్మ తన జీవితాంతం అక్కడ సెక్స్ వర్కర్ల అభ్యున్నతికి కృషి చేసింది. కానీ ఈ వ్యక్తులు మా అమ్మమ్మను చాలా అభ్యంతరకరంగా చూపిస్తున్నారు” అంటూ తమ ఆవేదనని వ్యక్తం చేశారు.