Bappi Lahiri : అల్లరి నరేష్, రవితేజ కోసం తెలుగులో కంబ్యాక్.. బప్పీ లహరి తెలుగులో పాడిన చివరి పాట ఇదే..

బప్పీ లహరికి తెలుగుతో ప్రత్యేకమైన అనుంబంధం ఉంది. తెలుగులో దాదాపు 25కి పైగా సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు, పాటలు కూడా పాడారు. తెలుగులో మొట్టమొదటి సారిగా 1986లో..........

Bappi Lahiri :  అల్లరి నరేష్, రవితేజ కోసం తెలుగులో కంబ్యాక్.. బప్పీ లహరి తెలుగులో పాడిన చివరి పాట ఇదే..

Disco Raja

Bappi Lahiri :   బెంగాలీలో పుట్టి బాలీవుడ్ ని శాషించిన ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, గాయకుడు బప్పీ లహరి మంగళవారం రాత్రి కన్నుమూశారు. బాలీవుడ్ లోనే కాక తెలుగులో కూడా చాలా చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని క్రిటీ కేర్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటూనే బప్పీ లహిరి మంగళవారం రాత్రి మరణించారు. బప్పి లహరి మృతిపై బాలీవుడ్, టాలీవుడ్ తో సహా దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

బప్పీ లహరికి తెలుగుతో ప్రత్యేకమైన అనుంబంధం ఉంది. తెలుగులో దాదాపు 25కి పైగా సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు, పాటలు కూడా పాడారు. తెలుగులో మొట్టమొదటి సారిగా 1986లో సూపర్‌ స్టార్‌ కృష్ణ నటించిన ‘సింహాసనం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలోని సాంగ్స్ ఎంత బాగా హిట్ అయ్యాయో మన అందరికి తెలిసిందే. ఆ తర్వాత త్రిమూర్తులు, స్టేట్‌రౌడీ, గ్యాంగ్‌ లీడర్, రౌడీ గారి పెళ్లాం, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్, బ్రహ్మ, నిప్పు రవ్వ, బిగ్‌ బాస్, ఖైదీ ఇన్‌స్పెక్టర్, పుణ్యభూమి నా దేశం.. వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్‌ అందించారు. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు సినిమాలకి బప్పీ లహరి ఎప్పటికి గుర్తుండిపోయే మంచి ఆల్బమ్స్ ఇచ్చారు.

బప్పీ లహరి కన్నుమూత.. స్పెషల్ స్టోరీ

1995లో ‘పుణ్యభూమి నా దేశం’ సినిమా తర్వాత ఆయన మళ్ళీ తెలుగులో పని చేయలేదు. దాదాపు 18 సంవత్సరాల తర్వాత 2013లో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘యాక్షన్ 3D’ సినిమాకి సంగీతం అందించారు. ఆ తర్వాత చివరి సారిగా మళ్ళీ ఏడేళ్ల తర్వాత 2020లో రవితేజ హీరోగా చేసిన ‘డిస్కో రాజా’ సినిమాలో టైటిల్ సాంగ్ ని పాడారు. తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో బప్పీ లహరి తన చివరి తెలుగు సాంగ్ ‘రమ్ పమ్ పమ్..’ పాడారు.