Gold Rate Today : గుడ్న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే.. వారం రోజులుగా ఎందుకిలా..
Gold Rate Today : ఇటీవల భారీగా పెరిగి రికార్డు గరిష్టాలకు చేరుకున్న బంగారం, వెండి ధరలు క్రమంగా కిందకు దిగి వస్తున్నాయి.

భారత దేశంలో శుభకార్యాల సీజన్ షురూకానుంది.. ఈనెల 19నుంచి శుభముహూర్తాలు ఉండటంతో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వచ్చే రెండు నెలలు శుభముహూర్తాలు ఉండటం, పెద్ద సంఖ్యలో పెండ్లిళ్లు జరగనుండటంతో బంగారంకు భారీగా డిమాండ్ పెరగనుంది.

ఇటీవల భారీగా పెరిగి రికార్డు గరిష్టాలకు చేరుకున్న బంగారం, వెండి ధరలు క్రమంగా కిందకు దిగి వస్తున్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తత పరిస్థితులు సర్దుమణుగుతున్న నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ రేట్లు రాబోయే రోజుల్లో భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

సోమవారం ఉదయం (ఫిబ్రవరి 16) నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్నటితో పోల్చిచూస్తే నేడు వీటి ధరలు తగ్గాయి. బంగారం రేటు భారీగా తగ్గింది. 22 క్యారెట్ల బంగారంపై 1,200 తగ్గగా, 24 క్యారట్ల బంగారంపై రూ.1,310 తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఔన్సు బంగారంపై ఐదు డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 5022 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే.. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,56,440కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,43,400 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,43,550కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,56,590కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,43,400కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,56,440కు వద్దకు చేరింది.

ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,80,000కు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.7వేలు తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి రేటు రూ.2,68,000 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,80,000 వద్ద కొనసాగుతుంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
