Team India : టీమ్ఇండియాకు గాయాల టెన్షన్.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13 మంది స్టార్ ప్లేయర్లకు..
స్టార్ ఆటగాళ్ల గాయాలు టీమ్ఇండియా మేనేజ్మెంట్ను (Team India ) కలవరపెడుతున్నాయి
Injury worries to Team India Not 1 or 2 or 3 but 13 Stars injured
Team India : శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో దూరం కాగా.. తాజాగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా వేలి గాయం కారణంగా శ్రీలంక క్రికెట్ XIతో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అయితే గిల్ గాయం తీవ్రమైనది కాదని టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది.
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి శ్రీలంక పర్యటనకు పూర్తిగా దూరమయ్యారు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడా అనే దానిపై సందేహాలు ఉన్నాయి. సాయి సుదర్శన్ కూడా తొలి టెస్టుకు ఫిట్నెస్ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు.
ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో 13 మంది ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకునేందుకు రిహాబిలిటేషన్ తీసుకుంటున్నారు.
13 మంది ఆటగాళ్లు.. వారి గాయాలు
- జస్ప్రీత్ బుమ్రా – ఎడమ మోకాలిలో సైనోవైటిస్
- హార్దిక్ పాండ్యా – ఎడమ తొడ క్వాడ్రిసెప్స్ గాయం
- వాషింగ్టన్ సుందర్ – రైట్ హ్యామ్‌స్ట్రింగ్ గాయం
- సాయి సుదర్శన్ – కుడి పాదంలో స్ట్రెస్ రియాక్షన్
- నితీశ్ కుమార్ రెడ్డి – ఎడమ తొడ క్వాడ్రిసెప్స్ గాయం
- యుద్వీర్ సింగ్ చరక్ – కుడి భుజానికి గాయం
- రియాన్ పరాగ్ – కుడి భుజం శస్త్రచికిత్స అనంతరం రిహాబిలిటేషన్
- హర్షిత్ రాణా – రైట్ హ్యామ్‌స్ట్రింగ్ గాయం
- వరుణ్ చక్రవర్తి – లెఫ్ట్ హ్యామ్‌స్ట్రింగ్ గాయం
- ఆకాశ్‌దీప్ సింగ్ – వెన్ను కింది భాగంలో స్ట్రెస్ ఫ్రాక్చర్
- హిమాన్షు సింగ్ – కుడి మోకాలి గాయం
- అశోక్ శర్మ – వెన్నులో స్ట్రెస్ ఫ్రాక్చర్, 11వ పక్కటెముకకు ఫ్రాక్చర్
- సుయశ్ శర్మ – మోకాలి గాయం
ఎడమ మోకాలి వాపు కారణంగా శ్రీలంక సిరీస్‌కు దూరమైన బుమ్రా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు చేరుకున్నాడు. వైద్య నిపుణులు చికిత్సలు అందించిన తర్వాత పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. రిహాబ్ ప్రారంభ దశలో జాగింగ్, సింగిల్ లెగ్ వ్యాయామాల సమయంలో బుమ్రాకు అసౌకర్యం ఎదురైంది. దీంతో ప్రస్తుతం అతడిపై బౌలింగ్ భారం పెట్టకుండా ప్రాథమిక శారీరక సామర్థ్యాన్ని తిరిగి సాధించడంపైనే దృష్టి పెట్టారు. అతడు ఎప్పుడు తిరిగి బౌలింగ్ చేస్తాడనే దానిపై ఇంకా స్పష్టమైన తేదీ లేదు.
ఇలా కీలక ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతుండటంతో శ్రీలంక సిరీస్‌కు ముందు టీమ్ఇండియా మేనేజ్మెంట్కు ఆటగాళ్ల ఫిట్నెస్ ఇప్పుడు ప్రధాన సవాలుగా మారింది. ఆటగాళ్లను క్యాలెండర్ తేదీల ఆధారంగా కాకుండా.. నిర్దిష్ట ఫిట్నెస్ ప్రమాణాలను చేరుకున్న తర్వాతే మ్యాచ్‌లకు అనుమతించాలని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్ణయించింది.
