Telangana Rains: తెలంగాణకు అలర్ట్.. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక!
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు(Telangana Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Meteorological Department announced heavy rains in ap and Tug for next two days.
Telangana Rains: తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Telangana Rains) వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణ జిల్లాలకు హెచ్చరికలు – ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు!
తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు (Rain Alert)కురిసే అవకాశముంది. ఈ క్రమంలో సదరు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.
