Nokia 3210 Relaunch: కీప్యాడ్ ఫోన్లలో ఇది హైలెట్.. రూ.4,299 కే నోకియా 3210 4Gతో.. సూపర్ ఫీచర్లు, పవర్ఫుల్ బ్యాటరీ
కియా 3210 (Nokia 3210 Relaunch) మళ్లీ కొత్త వెర్షన్ లో భారత్‌లో అధికారికంగా రీ-ఎంట్రీ ఇచ్చింది.
Nokia 3210 4G feature phone re-launch price and full details
Nokia 3210 Relaunch: ఒకప్పుడు ఇండియన్ మొబైల్ మార్కెట్ ను ఏకఛత్రాధిపత్యంతో శాసించిన ఐకానిక్ ఫోన్ నోకియా 3210 (Nokia 3210 Relaunch) మళ్లీ కొత్త వెర్షన్ లో భారత్‌లో అధికారికంగా రీ-ఎంట్రీ ఇచ్చింది. హెచ్ఎమ్డీ గ్లోబల్ సంస్థ పాత కాలపు క్లాసిక్ డిజైన్‌కు ఆధునిక 4G నెట్వర్క్ ఫీచర్లను జోడించి ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రోజువారీ సాధారణ కాలింగ్ అవసరాలు ఉండి, స్మార్ట్ఫోన్ల హడావుడి లేకుండా సింపుల్ కీప్యాడ్ ఫోన్ కోరుకునే వారికి, సెకండరీ డివైజ్ వెతికే వారికి ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలవనుంది.
ఆఫర్ ధర, డిజైన్ వివరాలు – రూ.4,299 కే అందుబాటులోకి:
నోకియా 3210 4G ఫీచర్ ఫోన్ అసలు ధర రూ.5,299 కాగా, ప్రస్తుతం హెచ్ఎమ్డీ అధికారిక వెబ్సైట్లో రూ.1,000 డిస్కౌంట్‌తో రూ.4,299 ఆఫర్ ధరకే అందుబాటులో ఉంది. కాంపాక్ట్ బాడీ మరియు ఐకానిక్ కీప్యాడ్ ఆకృతితో వస్తున్న ఈ ఫోన్ Y2K గోల్డ్, గ్రంజ్ బ్లాక్, స్కూబా బ్లూ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తోంది. ఇందులో 2.4 ఇంచుల QVGA డిస్ప్లేతో పాటు హెడ్ఫోన్ల కోసం 3.5mm ఆడియో జాక్‌ను కూడా అందించారు.
ఆధునిక ఫీచర్లు – టైప్-సీ ఛార్జింగ్, 4G కనెక్టివిటీ, బ్యాటరీ:
ఈ పాత కాలపు ఫీచర్ ఫోన్లో 1,450mAh రీఛార్జబుల్ అండ్ రిమూవబుల్ బ్యాటరీని చేర్చారు. డ్యూయల్ సిమ్ 4G నెట్‌వర్క్‌పై ఇది దాదాపు 9.8 గంటల లాంగ్ టాక్ టైమ్‌ను అందిస్తుందని సంస్థ పేర్కొంది. పాత మోడల్ అయినప్పటికీ, నేటి ట్రెండ్‌కు తగ్గట్లుగా ఇందులో టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, ఫొటోల కోసం 2MP రియర్ కెమెరాను అమర్చడం విశేషం.
Bank Holidays: వరుసగా 3 రోజులు బ్యాంక్ లు బంద్.. కస్టమర్లు తెలుసుకోవాల్సిన అంశాలివే
ఐకానిక్ స్నేక్ గేమ్ – మెమరీ, ఎఫ్ఎమ్ రేడియో సదుపాయం:
నోకియా ఫోన్లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పాతకాలపు ‘స్నేక్’ గేమ్, వైర్లెస్ ఎఫ్ఎమ్ రేడియో సదుపాయం ఇందులో కూడా అందుబాటులో ఉన్నాయి. ఎఫ్ఎమ్ రేడియోను వైర్డ్, వైర్లెస్ విధానాల్లో వినవచ్చు. ఈ ఫోన్ లో 64MB రామ్, 128MB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండగా, మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 32GB వరకు పెంచుకునే సదుపాయాన్ని కల్పించారు.
