Uttam Kumar Reddy: కాళేశ్వరంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. నవంబర్ నుంచే పునరుద్ధరణ పనులు.. మంత్రి ఉత్తమ్ క్లారిటీ!
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనుల కోసం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) స్పష్టం చేశారు.
Minister Uttam Kumar Reddy provides clarity on Kaleshwaram restoration works.
Uttam Kumar Reddy: తెలంగాణలో అత్యంత వివాదాస్పదమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలోని బ్యారేజీల పునరుద్ధరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను చేపట్టి, తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం మంత్రి ఈ విషయాలను వెల్లడించారు. భద్రత, నాణ్యత ప్రమాణాల్లో ఎక్కడా రాజీపడకుండా ఈ పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది.
Bank Holidays: వరుసగా 3 రోజులు బ్యాంక్ లు బంద్.. కస్టమర్లు తెలుసుకోవాల్సిన అంశాలివే
డిజైన్లు ఖరారు – అక్టోబర్ 5న సీడబ్ల్యూసీ టెక్నికల్ కమిటీ ముందుకు:
బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి ఎన్డీఎస్ఏ వ్యక్తంచేసిన అభ్యంతరాలు, నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ఇప్పటికే కొత్త డిజైన్లను ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ డిజైన్లను అక్టోబర్ 5వ తేదీన కేంద్ర నీటి సంఘం సాంకేతిక పర్యవేక్షణ కమిటీ పరిశీలనకు తీసుకెళ్లనున్నారు. సాంకేతిక అనుమతులు లభించిన వెంటనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, నవంబర్ నెల నుంచే క్షేత్రస్థాయిలో పునరుద్ధరణ పనులను వేగవంతంగా ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
2027 వర్షాకాలం నాటికి పూర్తి – గత వైఫల్యాలకు చెక్:
2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్‌కు చెందిన పిల్లర్లు కుంగిపోవడంతో డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు నీటి నిల్వను పూర్తిగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2027 వర్షాకాలం నాటికి ఈ మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను సంపూర్ణంగా పూర్తి చేసి, రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
