Bank Holidays: వరుసగా 3 రోజులు బ్యాంక్ లు బంద్.. కస్టమర్లు తెలుసుకోవాల్సిన అంశాలివే
సెప్టెంబర్ 28 నుండి 30 వరకు మూడు రోజుల పాటు ఉద్యోగులు దేశవ్యాప్త (Bank Holidays)సమ్మె చేపట్టనున్నారు.
Nationwide bank strike from september 28 to 30 and sbi open on sunday
Bank Holidays: దేశవ్యాప్తంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ రంగం మరోసారి స్తంభించనుంది. యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు సెప్టెంబర్ 28 నుండి 30 వరకు మూడు రోజుల పాటు ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నారు. సెప్టెంబర్ 26న నాలుగో శనివారం, 27న ఆదివారం సాధారణ సెలవులు(Bank Holidays) కావడం, ఆ వెంటనే సోమవారం నుంచి బుధవారం వరకు సమ్మె కొనసాగనుండటంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వరుసగా 5 రోజుల పాటు శాఖల సేవలకు తీవ్ర విఘాతం కలగనుంది. అయితే హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి ప్రైవేట్ బ్యాంకులు ఈ సమ్మెలో పాల్గొనడం లేదని, యథాతథంగా పనిచేస్తాయని ప్రకటించాయి.
ఎస్బీఐ కీలక నిర్ణయం – ఆదివారం కూడా బ్యాంకు శాఖలు ఓపెన్:
సమ్మె కారణంగా ఖాతాదారులకు తీవ్ర ఇబ్బందులు కలగకుండా చూసేందుకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 27 ఆదివారం నాడు తమ బ్యాంకు శాఖలను తెరిచి ఉంచుతామని, అత్యవసర లావాదేవీలు ఉన్న కస్టమర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది. మరోవైపు సమ్మె ప్రభావాన్ని తట్టుకునేందుకు రైల్వే బోర్డు తమ సిబ్బందికి సెప్టెంబర్ 25నే ముందస్తు జీతాలు చెల్లించగా, ఐసీఏఐ కూడా సెప్టెంబర్ 30 పన్నుల గడువు దృష్ట్యా చార్టర్డ్ అకౌంటెంట్లకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
వారానికి 5 రోజుల పనిదినాల డిమాండ్ – కస్టమర్లు తెలుసుకోవాల్సిన విషయాలివే!
వారానికి 5 రోజుల పనిదినాలను అమలు చేయడంతో పాటు పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ విధానంలో తీవ్ర అసమానతలను సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ యూనియన్లు ఈ పోరాటానికి దిగాయి. ముందస్తుగా క్యాష్ విత్డ్రాయల్స్, చెక్కుల క్లియరెన్స్ వంటి పనులను ముగించుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఒకవేళ శాఖల సేవలు అందుబాటులో లేకపోయినప్పటికీ ఎటిఎమ్లు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డిజిటల్ సేవలు యథాతథంగా కొనసాగుతాయని బ్యాంకింగ్ వర్గాలు స్పష్టం చేశాయి.
