Chiranjeevi : చిరంజీవి షోల్డర్ కి ఆపరేషన్ చేసింది ఇతనే.. చిన్న సర్జరీనే అంటూ మెగాస్టార్ పోస్ట్ వైరల్..
తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన సర్జరీ గురించి తెలుపుతూ పోస్ట్ చేసారు. (Chiranjeevi)
Chiranjeevi
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి షోల్డర్ కు సర్జరీ జరిగిందని సమాచారం. గత రెండు మూడు రోజులుగా ఎడమ చేతికి షోల్డర్ బ్యాగ్ వేసుకొని కనిపిస్తున్నారు. చిరంజీవి షోల్డర్ బ్యాగ్ తో ఉన్న ఫోటో వైరల్ గా మారడంతో అభిమానులు ఆందోళన చెందుతూ ఆయనకు ఏమైంది అని కామెంట్స్ చేస్తున్నారు. (Chiranjeevi)
తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన సర్జరీ గురించి తెలుపుతూ పోస్ట్ చేసారు. తనకు సర్జరీ చేసిన డాక్టర్ తో కలిసి దిగిన ఫోటో షేర్ చేసారు.
Also Read : Anchor Sravanthi : యాంకర్ స్రవంతి ఫస్ట్ సినిమా ఏంటో తెలుసా? 13 ఏళ్ళ క్రితమే.. స్టార్ హీరో సినిమాలో..
ఈ ఫోటో షేర్ చేసి.. చేయికి బ్యాగ్ గమనించిన తర్వాత చాలా మంది శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇది కేవలం ఒక చిన్న భుజం కీహోల్ సర్జరీ. నేను బాగా కోలుకుంటున్నాను, ఇప్పటికే నా రెగ్యులర్ వర్క్స్ మొదలు పెట్టాను. అత్యుత్తమ ఆర్థ్రోస్కోపీ సర్జన్లలో ఒకరైన డాక్టర్ నితిన్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన నైపుణ్యంతో ఈ ప్రక్రియను సజావుగా, సౌకర్యవంతంగా చేసారు. మీ అందరి ప్రేమ, ఆందోళన మరియు ఆశీర్వాదాలకు ధన్యవాదాలు అని తెలిపారు. దీంతో చిరంజీవి పోస్ట్ కింద జాగ్రత్త అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Kiran Abbavaram : బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. రేటు పెంచేసిన కిరణ్ అబ్బవరం..? లైనప్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే..
