Best Reliance Jio Plans : రూ. 300 లోపు బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ డేటా బెనిఫిట్స్ మీకోసం..!

Best Reliance Jio Plans : ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అలర్ట్.. మార్కెట్లో జియో అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లు సరసమైన ధరకే అందుబాటులో ఉన్నాయి. మీ ఆఫీసులో లేదా ఇంట్లో Wi-Fiని ఖరీదైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ఇప్పటికీ చెల్లిస్తున్నారా?

Best Reliance Jio Plans : రూ. 300 లోపు బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ డేటా బెనిఫిట్స్ మీకోసం..!

Best Jio plans under Rs 300 with unlimited voice calling, lots of data, and many more benefits

Best Reliance Jio Plans : ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అలర్ట్.. మార్కెట్లో జియో అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లు సరసమైన ధరకే అందుబాటులో ఉన్నాయి. మీ ఆఫీసులో లేదా ఇంట్లో Wi-Fiని ఖరీదైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ఇప్పటికీ చెల్లిస్తున్నారా? అయితే, జియో ఖరీదైన ప్లాన్‌లను కొనకూడదని డిసైడ్ అయ్యారా? లేదా జియోను సెకండరీ సిమ్‌గా ఉపయోగిస్తున్నారా?

అయితే మీకోసం జియోలో రూ. 300లోపు కొన్ని సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందుబాటులో ఉన్నాయి. ఈ జియో ప్లాన్‌లు అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS, డేటాను పొందవచ్చు. వాయిస్ కాల్‌లు, రోజువారీ డేటాను పొందవచ్చు. అంతేకాదు.. మరెన్నో అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు.

రూ. 300లోపు జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు : ఫుల్ లిస్టు మీకోసం :

జియో రూ. 149 ప్లాన్ :
ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలతో వస్తుంది. ఒకసారి చెల్లించినట్లయితే.. 20 రోజులు వ్యాలిడిటీ పొందవచ్చు. రోజుకు 1GB డేటాను అందిస్తుంది. మొత్తం డేటాలో 20GB వస్తుంది. JioTV, Jio సినిమా, ఇతర Jio యాప్‌లకు ఉచిత సభ్యత్వాలతో పాటు అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు.

జియో రూ. 179 ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 24 రోజుల ప్యాక్ వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 1GB డేటాను అందిస్తుంది. JioTV, Jio సినిమా, ఇతర Jio యాప్‌లు కూడా ప్యాకేజీలో భాగంగా ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.

Read Also : Reliance Jio Services : రిలయన్స్ జియోకు ఏమైంది? దేశమంతటా స్తంభించిన సర్వీసులు.. యూజర్లు కాల్‌లు చేయలేరు, మెసేజ్ పంపలేరు..!

Jio రూ 199 ప్లాన్ :
23 రోజుల వ్యాలిడిటీ సమయంలో ఈ ప్లాన్ రోజువారీ డేటాను 1.5 GB అందిస్తుంది. అదనంగా, ప్రీపెయిడ్ ప్లాన్ Jio అప్లికేషన్‌లకు ఉచిత యాక్సెస్, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలతో వస్తుంది.

జియో రూ 209 ప్లాన్ :
ఈ ప్లాన్ రోజుకు 1GB డేటాతో 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. రీఛార్జ్ ప్లాన్‌లో JioTV, Jio సినిమా, ఇతర జియో యాప్‌లకు ఉచిత యాక్సెస్ పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు పొందవచ్చు.

Best Jio plans under Rs 300 with unlimited voice calling, lots of data, and many more benefits

Best Jio plans under Rs 300 with unlimited voice calling, lots of data

జియో 239 ప్లాన్ :
అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలతో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల నెలవారీ వ్యాలిడిటీతో వస్తుంది. 1.5GB రోజువారీ డేటాను కూడా అందిస్తుంది. JioTV, Jio సినిమా, మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది.

జియో రూ 249 ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 23 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 2GB రోజువారీ డేటాను అందిస్తుంది.

జియో రూ. 259 ప్లాన్ :
జియో వినియోగదారులు క్యాలెండర్ నెల వ్యాలిడిటీ, 1.5GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, Jio యాప్‌లకు ఉచిత సభ్యత్వాన్ని పొందవచ్చు.

జియో రూ. 299 ప్లాన్ :
ఈ ప్లాన్ మొత్తం 56GB డేటాతో 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. జియో యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌తో కలిపి 2GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Reliance Jio Services : రిలయన్స్ జియోకు ఏమైంది? దేశమంతటా స్తంభించిన సర్వీసులు.. యూజర్లు కాల్‌లు చేయలేరు, మెసేజ్ పంపలేరు..!