Reliance Jio Services : రిలయన్స్ జియోకు ఏమైంది? దేశమంతటా స్తంభించిన సర్వీసులు.. యూజర్లు కాల్‌లు చేయలేరు, మెసేజ్ పంపలేరు..!

Reliance Jio Services : ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) అంతరాయం ఏర్పడింది. జియో సర్వీసులను అందించడంలో ఎదుర్కొంటున్నట్లు చాలా మంది యూజర్లు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేశారు.

Reliance Jio Services : రిలయన్స్ జియోకు ఏమైంది? దేశమంతటా స్తంభించిన సర్వీసులు.. యూజర్లు కాల్‌లు చేయలేరు, మెసేజ్ పంపలేరు..!

Jio users are unable to make calls, send messages across India

Reliance Jio Services : ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) అంతరాయం ఏర్పడింది. జియో సర్వీసులను అందించడంలో ఎదుర్కొంటున్నట్లు చాలా మంది యూజర్లు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేశారు. మంగళవారం (నవంబర్ 29) ఉదయం నుంచి జియో సర్వీసులు చాలావరకు నిలిచిపోయాయని యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జియో యూజర్లు తమ ఫోన్ కాల్స్ మాత్రమే కాకుండా కనీసం SMSలు కూడా పంపలేకపోతున్నామని సోషల్ మీడియాకు నివేదించారు. కొంతమంది జియో యూజర్లు ఉదయం నిద్ర లేవగానే మెసేజ్‌లు పంపలేకపోయారు.

Jio users are unable to make calls, send messages across India

Jio users are unable to make calls, send messages across India

Read Also : Jio Prepaid Plans : రిలయన్స్ జియో నుంచి అదిరే 2 ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. ఇందులో ఏ ప్లాన్ బెటర్ అంటే?

జియో మొబైల్ డేటా సర్వీసులు అంతరాయం ఉన్నప్పటికీ యూజర్లందరికి జియో ఇతర సర్వీసులు సాధారణంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. జియో ఫోన్ కాలింగ్ SMS సర్వీసులు మాత్రమే ప్రభావితమయ్యాయి. Twitter యూజర్ ప్రకారం.. ఈరోజు ఉదయం నుంచి volte ఐకాన్ కనిపించలేదు. దాంతో యూజర్లు ఏ కాల్స్ చేయలేకపోయామని నివేదించారు. సాధారణ కాల్‌లకు సమస్యలు ఉన్నప్పుడే.. కొంతమంది యూజర్లు ఇంటర్నెట్ సర్వీసులను కూడా ఉపయోగించలేరు. అయితే కొంతమంది యూజర్లకు మాత్రమే జియో పనిచేస్తుంది. యూజర్లకు కలిగిన జియో అంతరాయాన్ని ఇంకా పరిష్కరించలేదు.

Jio users are unable to make calls, send messages across India

Jio users are unable to make calls, send messages across India

డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. అంతరాయాలను ట్రాక్ చేసే వెబ్‌సైట్, జియో భారత్‌లో చాలా మంది యూజర్ల కోసం ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య పనిచేయడం నిలిచిపోయాయి. 37 శాతం మంది యూజర్లు సిగ్నల్ పొందడం లేదని ఫిర్యాదు చేశారు. 37 శాతం మంది యూజర్లు ఫోన్ కాల్స్, మెసేజ్‌లు పంపలేకపోయారు.  అలాగే మిగిలిన 26 శాతం మంది యూజర్లు మొబైల్ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయలేకపోతున్నారని వెబ్‌సైట్ నివేదించింది. జియో అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా సహా ఇతర నగరాలు ఉన్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Jio Short Video App : ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు పోటీగా జియోలో కొత్త యాప్ వచ్చేసిందోచ్.. ఇకపై షార్ట్ వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు!