Jio Prepaid Plans : రిలయన్స్ జియో నుంచి అదిరే 2 ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. ఇందులో ఏ ప్లాన్ బెటర్ అంటే?

Jio Prepaid Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అదనపు బెనిఫిట్స్ అందిస్తోంది. వివిధ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. టెలికాం ఆపరేటర్ నుంచి అన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లు అన్‌లిమిటెడ్ డేటా, హై-స్పీడ్ ఇంటర్నెట్, SMS బెనిఫిట్స్ అందిస్తోంది.

Jio Prepaid Plans : రిలయన్స్ జియో నుంచి అదిరే 2 ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. ఇందులో ఏ ప్లాన్ బెటర్ అంటే?

Jio Rs 719 vs Rs 749 plan _ which prepaid plan offers better value

Jio Prepaid Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అదనపు బెనిఫిట్స్ అందిస్తోంది. వివిధ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. టెలికాం ఆపరేటర్ నుంచి అన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లు అన్‌లిమిటెడ్ డేటా, హై-స్పీడ్ ఇంటర్నెట్, SMS బెనిఫిట్స్ అందిస్తోంది. ఎక్కువ కాలం వ్యాలిడిటీ అందించే అత్యంత అరుదైన ప్లాన్‌లలో రెండు అదిరే ప్లాన్‌లు ఉన్నాయి.

ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధర రూ.719, రూ.749గా ఉన్నాయి. రెండు ప్లాన్‌లు కాలింగ్, హై-స్పీడ్ డేటా, SMS బెనిఫిట్స్‌తో పాటు Jio యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తాయి. వివిధ యూజర్లు అవసరాలను తీర్చేందుకు జియో ఈ ప్లాన్‌లను అందిస్తోంది. మీరు దీర్ఘకాలం వ్యాలిడిటీ అయ్యే ప్లాన్‌ని కొనుగోలు చేయవచ్చు. Jio రూ. 719, రూ. 749 ప్లాన్‌లతో బెనిఫిట్స్ పొందవచ్చు.

జియో రూ. 719 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలివే..
* ప్లాన్ వాలిడిటీ 84 రోజులు.
* రోజుకు 2GB డేటా అంటే మొత్తం 168 GB డేటా.
* అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్.
* రోజుకు 100 ఉచిత SMS.
* JioTV, JioCinema, JioSecurity, JioCloudకి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్.

Jio Rs 719 vs Rs 749 plan _ which prepaid plan offers better value

Jio Rs 719 vs Rs 749 plan _ which prepaid plan offers better value

జియో రూ. 749 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలివే :
* ప్లాన్ వాలిడిటీ 90 రోజులు.
* రోజుకు 2 GB డేటా అంటే మొత్తం 180 GB డేటా.
* అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్.
* రోజుకు 100 ఉచిత SMS.
* JioTV, JioCinema, JioSecurity మరియు JioCloudకి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్.

రెండు ప్లాన్‌లు రూ. 800 లోపు, రోజుకు 2GB డేటాతో పాటు Jio యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తాయి. రూ. 719 ప్లాన్ రోజుకు 8.56 INR ధరతో 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. మరోవైపు, రూ.749 ప్లాన్‌లు దాదాపు మూడు నెలల వ్యాలిడిటీతో రోజుకు దాదాపు 8.32 ఖర్చుతో పొందవచ్చు.

మీరు ఈ రెండు ప్లాన్‌లను పోల్చి చూస్తే.. రూ. 749 విలువైన ప్లాన్ చాలా బెటర్ అని చెప్పవచ్చు. ఎక్కువ డేటాను అందిస్తుంది. దాదాపు రూ. 30 అదనపు ఖర్చు అవుతుంది. మీరు కొంచెం టైట్ బడ్జెట్ కలిగి ఉంటే.. మీరు వ్యాలిడిటీతో రూ. 719 ప్లాన్‌ని ఎంచుకోవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 14 Price Offer : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. ఇదే సరైన సమయం.. ఇప్పుడే కొనేసుకోండి..!