Jio Short Video App : ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు పోటీగా జియోలో కొత్త యాప్ వచ్చేసిందోచ్.. ఇకపై షార్ట్ వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు!

Jio Short Video App : రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అలర్ట్.. రోలింగ్ స్టోన్ ఇండియా (Rolling Stone India), క్రియేటివ్‌ల్యాండ్ ఆసియా భాగస్వామ్యంతో జియో ప్లాట్‌ఫారమ్‌లు కొత్త షార్ట్ వీడియో యాప్‌ను ఆవిష్కరించింది.

Jio Short Video App : ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు పోటీగా జియోలో కొత్త యాప్ వచ్చేసిందోచ్.. ఇకపై షార్ట్ వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు!

Reliance Jio introduces Platfom short video app like Instagram reels

Jio Short Video App : రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అలర్ట్.. రోలింగ్ స్టోన్ ఇండియా (Rolling Stone India), క్రియేటివ్‌ల్యాండ్ ఆసియా భాగస్వామ్యంతో జియో ప్లాట్‌ఫారమ్‌లు కొత్త షార్ట్ వీడియో యాప్‌ను ఆవిష్కరించింది. జియో యూజర్లకు మెరుగైన ఎక్స్ పీరియన్స్ అందించేందుకు క్రియేటర్లకు మరిన్ని మానిటైజేషన్ ఆప్షన్లను అందిస్తామని తెలిపింది. జియో షార్ట్-ఫారమ్ సోషల్ మీడియాకు అంతరాయం కలిగించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

కొత్త యాప్‌ను లాంచ్ చేయడం ద్వారా క్రియేటర్ ఎకానమీ watch me నుంచి book meకు మార్చాలనుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. స్టేబుల్ మానిటైజేషన్ కోరుకునే స్టార్ ఎంటర్‌టైనర్‌లకు లక్ష్యంగా మారింది. గాయకులు, సంగీతకారులు, నటులు, హాస్యనటులు, నృత్యకారులు, ఫ్యాషన్ డిజైనర్లు సహా క్రియేటర్లందరికి ఇదో ఎంటర్ టైన్మెంట్ ప్లాట్ ఫారంగా మారనుందని జియో ప్లాట్‌ఫారం తెలిపింది. ఇంకా ఇంటర్‌ఫేస్, ఇతర వివరాలను జియో వెల్లడించలేదు. షార్ట్ వీడియోలను పోస్ట్ చేసే వేదికగా Instagram రీల్స్‌తో సమానంగా పనిచేస్తుంది. కానీ, జియో యూజర్లకు మానిటైజేషన్ ఆప్షన్లను అందించాలని యోచిస్తోంది.

జియో షార్ట్ వీడియో యాప్ : ఇప్పుడు అందుబాటులో ఉందా?
జియో షార్ట్ వీడియో యాప్ బీటా వెర్షన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. స్టేబుల్ వెర్షన్ జనవరి 2023లో అందరికి అందుబాటులోకి రానుంది. అయితే, దాని ప్రారంభ దశలో అందరూ లాగిన్ చేయలేరు. మొదటి 100 మంది వ్యవస్థాపక సభ్యులు మాత్రమే ఇన్వైట్ సిస్టమ్ ద్వారా యాప్‌ను ఉపయోగించవచ్చు.

Reliance Jio introduces Platfom short video app like Instagram reels

Reliance Jio introduces Platfom short video app like Instagram reels

Read Also : Reliance Jio 5G : గుజరాత్‌లోని అన్ని నగరాల్లోకి జియో ట్రూ 5G సర్వీసులు.. యూజర్లు ఉచితంగా 1Gbps డేటా యాక్సస్ చేసుకోవచ్చు..!

అంతేకాదు.. వారి ప్రొఫైల్‌లలో గోల్డెన్ టిక్ వెరిఫికేషన్ ద్వారా గుర్తించే అవకాశం ఉందని Jio ధృవీకరించింది. ఈ సభ్యులు రిఫరల్ ప్రోగ్రామ్‌ల ద్వారా సైన్ అప్ చేసేందుకు కొత్త ఆర్టిస్ట్ సభ్యులను ఆహ్వానించవచ్చు. కొత్త ప్లాట్‌ఫామ్ షార్ట్ వీడియో యాప్ త్వరలో క్రియేటర్లకు అందుబాటులో ఉంటుందని జియో ధృవీకరించింది.

క్రియేటర్లకు యాప్ స్టోరేజీ ఎంతంటే? :
జియో కంపెనీ క్రియేటర్‌లకు చాలా ప్రాధాన్యత ఇస్తోంది. యూజర్లు తమ యాప్‌లో డబ్బు సంపాదించేందుకు అవకాశం కల్పిస్తోంది. యాప్ అల్గారిథమ్‌లపై ఎలాంటి పేమెంట్స్ ఉండవని, యూజర్లు తమ ప్రొఫైల్ ర్యాంకింగ్, పాపులారిటీని బట్టి ఎక్కువ ప్రాధాన్యత పొందుతారని Jio వెల్లడించింది. ప్లాట్‌ఫామ్ డెవలప్ అయ్యే పేమెంట్ అల్గారిథమ్‌లకు ప్రాధాన్యత ఇవ్వదని తెలిపింది. అలాగే క్రియేటర్ల ర్యాంక్‌లు, పాపులారిటీని పెంచడానికి అనుమతిస్తుంది. యూజర్ల పాపులారిటీ ఆధారంగా మోనటైజేషన్ అవకాశం కల్పించనుంది. తద్వారా క్రియేటర్లు ఆదాయాన్ని ఆర్జించవచ్చు.

షార్ట్ వీడియో క్రియేటర్లలో ఫ్యాన్స్ కంటెంట్ ఎంగేజ్‌మెంట్‌పై ఆధారంగా సిల్వర్, బ్లూ, రెడ్ టిక్ వెరిఫికేషన్ల ద్వారా అందించనుంది. పేమెంట్ ప్రమోషన్‌లు కాదని జియో తెలిపింది. క్రియేటర్‌లు తమ ప్రొఫైల్‌లలో ‘Book Now’ బటన్‌ను పొందుతారని తెలిపింది. అంతేకాకుండా, క్రియేటర్లు రోలింగ్ స్టోన్ ఇండియా డిజిటల్ ఎడిటోరియల్స్‌లో కూడా ప్రీమియం వెరిఫికేషన్ పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Jio Prepaid Plans : రిలయన్స్ జియో నుంచి అదిరే 2 ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. ఇందులో ఏ ప్లాన్ బెటర్ అంటే?