Reliance Jio 5G : గుజరాత్‌లోని అన్ని నగరాల్లోకి జియో ట్రూ 5G సర్వీసులు.. యూజర్లు ఉచితంగా 1Gbps డేటా యాక్సస్ చేసుకోవచ్చు..!

Reliance Jio 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) భారత్ అంతటా తన ట్రూ 5G సర్వీసులను (True 5G Services) వేగంగా అందిస్తోంది. టెలికాం ఆపరేటర్ ఇప్పటికే 12 భారతీయ నగరాల్లో ఐదవ జనరేషన్ నెట్‌వర్క్ సర్వీసులను అందించడం ప్రారంభించింది.

Reliance Jio 5G : గుజరాత్‌లోని అన్ని నగరాల్లోకి జియో ట్రూ 5G సర్వీసులు.. యూజర్లు ఉచితంగా 1Gbps డేటా యాక్సస్ చేసుకోవచ్చు..!

Reliance Jio 5G available in all cities of Gujarat, Jio users in the state can avail 5G services for free

Reliance Jio 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) భారత్ అంతటా తన ట్రూ 5G సర్వీసులను (True 5G Services) వేగంగా అందిస్తోంది. టెలికాం ఆపరేటర్ ఇప్పటికే 12 భారతీయ నగరాల్లో ఐదవ జనరేషన్ నెట్‌వర్క్ సర్వీసులను అందించడం ప్రారంభించింది. అందులో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, వారణాసి, కోల్‌కతా, పూణే, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, బెంగళూరు, ఫరీదాబాద్ ఉన్నాయి. ఇప్పుడు జియో తన 5G సర్వీసులను గుజరాత్ రాష్ట్రం అంతటా ప్రారంభించింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్ 33 జిల్లా ప్రధాన కార్యాలయాల్లో 100 శాతం 5G కవరేజీని అందించిన మొదటి భారతీయ రాష్ట్రంగా గుజరాత్‌ను ప్రకటించింది. నవంబర్ 25 నుంచి గుజరాత్‌లోని జియో యూజర్లు తమ జియో వెల్‌కమ్ ఆఫర్‌ (Jio Welcome Offer)కు ఇన్వైట్ చేస్తుంది.

Reliance Jio 5G available in all cities of Gujarat, Jio users in the state can avail 5G services for free

Reliance Jio 5G available in all cities of Gujarat, Jio users in the state

ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా 1gbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చునని Jio అధికారిక ప్రకటనలో తెలిపింది. Jio True 5Gగా పిలిచే వేగవంతమైన నెట్‌వర్క్ సర్వీసులు గుజరాత్, ఇతర రాష్ట్రాల్లో విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, IOT రంగాలలో జియో 5G-ఆధారిత కార్యక్రమాలను ప్రారంభించేందుకు రిలయన్స్ జియోకు సాయపడతాయి. Jio రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో ‘అందరికీ విద్య’ పేరుతో నిజమైన 5G-ఆధారిత సర్వీసులను ప్రకటించింది. ఈ చొరవతోనే టెలికాం దిగ్గజం గుజరాత్‌లోని 100 పాఠశాలలను మొదట్లో డిజిటలైజ్ చేయాలని, ఇలాంటి 5G సర్వీసులను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

* JioTrue5G కనెక్టివిటీ
* అధునాతన కంటెంట్ ప్లాట్‌ఫారమ్
* ఉపాధ్యాయ & విద్యార్థి సహకార వేదిక
* పాఠశాల నిర్వహణ వేదిక

అదే సమయంలో, గుజరాత్, ఇతర Jio 5G-రెడీ నగరాల్లోని Jio యూజర్లు లేటెస్ట్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవ్వవచ్చు. 5G సర్వీసులను ఉచితంగా యాక్సస్ చేసుకోవచ్చు. వినియోగదారులు 5G రెడీ స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉంటే Jio వెల్‌కమ్ 5G ఆఫర్‌లో భాగంగా Jio 1gbps వేగంతో అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తోంది. కొత్త 5G సర్వీసులు 4G సిమ్‌లకు ఆటోమాటిక్‌గా కనెక్ట్ అవుతాయని 5G లాంచ్ సందర్భంగా Jio తన యూజర్లకు హామీ ఇచ్చింది. కాబట్టి 5G కనెక్టివిటీని పొందడానికి కస్టమర్‌లకు కొత్త సిమ్ అవసరం లేదు. అయితే, Jio యూజర్లందరూ వెల్‌కమ్ ఆఫర్‌ను ఉపయోగించుకోలేరు.

Reliance Jio 5G available in all cities of Gujarat, Jio users in the state can avail 5G services for free (

Reliance Jio 5G available in all cities of Gujarat, Jio users in the state

జియో ఆహ్వానం ఆధారంగా జియో 5G వెల్‌కమ్ ఆఫర్‌ను లాంచ్ చేస్తోంది. వినియోగదారులు సర్వీసులను పొందేందుకు జియో నుంచి ఆహ్వానం కోసం వేచి ఉండాలి. మీరు MyJio యాప్‌లో వివరాలను చెక్ చేసి ఆహ్వానించవచ్చు. మీ 5G స్మార్ట్‌ఫోన్ తయారీదారుల నుంచి 5G అప్‌డేట్‌ను పొందిందని నిర్ధారించుకోండి. Oppo, Samsung, Realme, ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీదారులు Jio 5G సపోర్టు కోసం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తున్నాయి. Apple డిసెంబర్ 2022లో 5G కనెక్టివిటీతో iOS 16.2ని రిలీజ్ చేస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Reliance Jio 5G : దేశంలోని 12 నగరాల్లో జియో 5G సర్వీసులు.. కానీ, అక్కడి యూజర్లు 5G వాడలేరట.. ఎందుకో తెలుసా?