Best Smartphones : 2023 జనవరిలో రూ. 35వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన బ్రాండ్ ఫోన్ కొనేసుకోండి..!

Best Smartphones : 2023 ఏడాదిలో కొత్త స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఏదైనా కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా?

Best Smartphones : 2023 జనవరిలో రూ. 35వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన బ్రాండ్ ఫోన్ కొనేసుకోండి..!

Best smartphones to buy this January for under Rs 35,000: Nothing Phone 1 and 3 more

Best Smartphones : 2023 ఏడాదిలో కొత్త స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఏదైనా కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. వివిధ ఆప్షన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న స్మార్ట్‌ఫోన్లలో టాప్ మిడ్-రేంజ్ ఫోన్లు ఒకటి.  సబ్ కేటగిరీ ఫోన్లలో రూ. 35వేల లోపు ధరకు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

వాస్తవానికి, స్టార్ కెమెరా పర్ఫార్మెన్స్ నుంచి ప్రత్యేకమైన డిజైన్‌ల వరకు యూజర్లు ఈ ధర విభాగంలో అద్భుతమైన ఆప్షన్లను పొందవచ్చు. కానీ, ప్రతి స్మార్ట్‌ఫోన్‌ను బెస్ట్ ఫోన్ అని చెప్పలేం. మీ బడ్జెట్ దాదాపు రూ. 35వేలు ఉంటే.. టాప్-మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలను కుంటున్నారా? అయితే ఈ ఏడాది జనవరిలో రూ. 35వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లలో 4 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల లిస్టును అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

1. Nothing Phone (1) :
2022లో అత్యంత పాపులర్ స్మార్ట్‌ఫోన్ Nothing Phone (1).. ఇప్పుడు ఈ ఫోన్ 2023లో ప్రత్యేకమైన డిజైన్‌తో మార్కెట్లో అందుబాటులో ఉంది. కానీ, నథింగ్ ఫోన్ (1) డిజైన్ కన్నా చాలా ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుంది.

గరిష్టంగా 12GB RAM ఆప్షన్లతో వస్తుంది. అదనంగా, ఫోన్ ఎడ్జ్-టు-ఎడ్జ్ 120Hz AMOLED ప్యానెల్‌ సిమెట్రిక్ బెజెల్స్‌తో కలిగి ఉంది. ఈ నథింగ్ ఫోన్ (1) బ్లోట్‌వేర్-రహిత Android OS ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అందిస్తుంది.

Best smartphones to buy this January for under Rs 35,000: Nothing Phone 1 and 3 more

Best smartphones to buy this January for under Rs 35,000

Read Also : Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. పోకో స్మార్ట్‌ఫోన్లపై అదిరే డీల్స్.. ఏ మోడల్ ధర ఎంతో తెలిస్తే.. ఇప్పుడే కొనేస్తారు..!

వివిధ లైటింగ్ కండిషన్లలో కొన్ని ఫొటోలు, వీడియోలను రికార్డు చేసేందుకు బెస్ట్ కెమెరా సిస్టమ్‌ కలిగి ఉంది. నథింగ్ ఫోన్ (1) మోడల్ బ్లాక్ అండ్ వైట్ వంటి రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అందులో 3 వేరియంట్‌లు ఉండగా.. 8GB RAM + 128GB స్టోరేజీ ధర రూ. 29,999గా ఉంటే.. మధ్య వేరియంట్ 8GB RAM + 256GB స్టోరేజీ ధర రూ. 31,999గా ఉంటుంది. చివరగా, టాప్-ఆఫ్-ది-లైన్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం రూ. 35,999కి అందుబాటులో ఉంది.

Best smartphones to buy this January for under Rs 35,000: Nothing Phone 1 and 3 more

Best smartphones to buy this January for under Rs 35,000

2. Google Pixel 6a :
నథింగ్ ఫోన్ (1) ప్రత్యేక డిజైన్ కలిగి ఉంటే.. Google Pixel 6a మిడ్-రేంజ్ ధర విభాగంలో అత్యుత్తమ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. వాస్తవానికి, Pixel 6a పటిష్టమైన కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఏదైనా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లతో ఈ పిక్సెల్ 6a అగ్రస్థానంలో ఉండవచ్చు. స్టెల్లార్ కెమెరాతో పాటు, Pixel 6a లోపల టెన్సర్ చిప్ కూడా ఉంది.

4 ఏళ్ల పాటు సెక్యూరిటీ ప్యాచ్‌లతో పాటు 3 ఏళ్ల ఫ్యూచర్ OS అప్‌డేట్‌లను అందించనుంది. ఆండ్రాయిడ్ 13 స్టాక్‌కు అదనపు బోనస్ కూడా అందిస్తోంది. Google Pixel 6a ఫోన్ (6GB RAM + 128GB స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 34,199కి అందుబాటులో ఉంది.

Best smartphones to buy this January for under Rs 35,000: Nothing Phone 1 and 3 more

Best smartphones to buy this January for under Rs 35,000

3. iQOO 9 SE :
ఐక్యూ కంపెనీ అందించే స్పెషల్ మోడళ్లలో iQOO 9 SE 5G అత్యుత్తమ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ అని చెప్పవచ్చు. వాస్తవానికి, పనితీరుపై దృష్టి సారించే మెరుగైన స్మార్ట్‌ఫోన్‌లు ఎన్నో మార్కెట్లో ఉన్నాయి, అయితే ఆ ఫోన్ల ధర iQOO 9 SE కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 888 SoC పవర్ అందిస్తుంది. చాలా స్టైలిష్ డిజైన్‌తో వస్తుంది.

పిక్సెల్ 6A పక్కన పెడితే, iQOO 9 SE ఫోన్ కన్నా మెరుగైన కెమెరా సిస్టమ్‌ను అందిస్తుంది. మల్టీమీడియా సామర్థ్యంతో E4 AMOLED డిస్‌ప్లే, స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. బ్లోట్‌వేర్-రహిత సాఫ్ట్‌వేర్ కలిగి ఉంది. iQOO 9 SE ప్రస్తుతం రెండు RAM, స్టోరేజ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. అందులో 8GB + 128GB స్టోరేజ్ ధర రూ. 30,990 ఉండగా.. 12GB + 256GB స్టోరేజ్ ధర రూ. 34,990గా ఉంది.

Best smartphones to buy this January for under Rs 35,000: Nothing Phone 1 and 3 more

Best smartphones to buy this January for under Rs 35,000

4. Redmi Note 12 Pro+ 5G :
రెడ్‌మి స్మార్ట్‌ఫోన్లలో Redmi Note డివైజ్‌లు ఎల్లప్పుడూ బడ్జెట్ కింగ్‌ నిలుస్తాయి. అయితే, ఈ ఏడాదిలో Redmi Note 12 Pro+ ఫోన్ రూ. 30వేల ధరను దాటిన మొదటి నోట్‌ ఫోన్‌గా నిలిచింది. కానీ, ఈ ఏడాదిలో నోట్ 12 ప్రో+ 12GB RAM ఆప్షన్‌తో వచ్చిన మొదటి నోట్ మోడల్ అని చెప్పవచ్చు. OISతో 200MP ప్రైమరీ రియర్ కెమెరాతో వచ్చింది. వివిధ రకాల లైటింగ్ పరిస్థితుల్లోనూ ఫోటోలు, వీడియోలను రికార్డు చేయవచ్చు.

అత్యంత వేగంగా ఛార్జింగ్ అయ్యే ఫోన్‌ కూడా. 120W ఫాస్ట్ ఛార్జర్ నోట్ 12 ప్రో+ 5,000mAh బ్యాటరీని 20 నిమిషాలలోపు పూర్తిగా ఛార్జ్ చేయగలదు. Redmi Note 12 Pro+ 5G రెండు RAM, స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 8GB RAM వేరియంట్ ధర రూ.29,999 కాగా, 12GB RAM వేరియంట్ ధర రూ.32,999గా ఉంది. రెండు వేరియంట్‌లలో 256GB స్టోరేజీ ఒకే మాదిరిగా ఉంటుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Amazon Great Republic Day Sale : జనవరి 15 నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఐఫోన్లపై టాప్ డీల్స్, వన్‌ప్లస్ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!