Bheemla Nayak: రిలీజ్‌కి ముందే దంచి కొట్టి.. కలెక్షన్స్‌తో అదరగొడుతున్న భీమ్లా!

ప్రీరిలీజ్ లెక్కలు.. రిలీజ్ కి ముందే హై హైప్ తో ఫుల్ గా ట్రెండ్ అవుతోంది భీమ్లానాయక్. ఇప్పటికే ట్రైలర్ ని సూపర్బ్ గా ఎంజాయ్ చేస్తోన్న ఫ్యాన్స్ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని వెయిట్

Bheemla Nayak: రిలీజ్‌కి ముందే దంచి కొట్టి.. కలెక్షన్స్‌తో అదరగొడుతున్న భీమ్లా!

Bheemla Nayak

Bheemla Nayak: ప్రీరిలీజ్ లెక్కలు.. రిలీజ్ కి ముందే హై హైప్ తో ఫుల్ గా ట్రెండ్ అవుతోంది భీమ్లానాయక్. ఇప్పటికే ట్రైలర్ ని సూపర్బ్ గా ఎంజాయ్ చేస్తోన్న ఫ్యాన్స్ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే సెలబ్రిటీస్ నుంచి కామన్ ఆడియన్స్ వరకూ భీమ్లా నాయక్ టాపిక్కే హైలైట్ గా మారుతోంది. రికార్డులని ఒడిసిపట్టి, రిలీజ్ కు ముందే దంచి కొట్టి, ప్రీ రిలీజ్ కలెక్షన్స్ తో అదరగొడుతున్న లాల్లా.. భీమ్లా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అంచనాలను ఇంకా ఇంకా పెంచేసింది.

Bheemla Nayak: హిందీలో భీమ్లా రిలీజ్.. కానీ ప్రమోషన్ ఎక్కడ?

భీమ్లానాయక్ ప్రి రిలీజ్ ఫంక్షన్ అభిమానుల కేరింతల మధ్య చాలా గ్రాండ్ గా జరిగింది. పొలిటికల్ గా తనకంటూ స్పెషల్ స్ట్రాటజీ క్రియేట్ చేసుకున్న కేటీఆర్.. పవన్ కళ్యాణ్ కోసం అతిథిగా విచ్చేయడంతో అభిమానుల ఆనందానికి అవుధులే లేవు. శ్రీ కృష్ణుడి లీలను భీమ్లానాయక్ హీరోయిజానికి అడాప్ట్ చేసి, త్రివిక్రమ్ లాలా భీమ్లా సాంగ్ రాశాడు. అదిప్పుడు పవన్ కళ్యాణ్ స్టామినాకు ఎగ్జాంపుల్ అయ్యింది. అసలే టీజర్ నుంచి లేటెస్ట్ ట్రయిలర్ వరకు భీమ్లానాయక్ సినిమాపై రోజు రోజుకీ హైప్ పెరిగిపోతోందంటే.. ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ ఆ బజ్ ని డబుల్ చేసింది.

Bheemla Nayak: బెనిఫిట్ షో వేస్తే కఠిన చర్యలే.. ఏపీ ప్రభుత్వం నోటీసులు

యూఎస్ఏలోనే భీమ్లానాయక్ హాఫ్ మిలియన్ డాలర్స్ ప్రీ సేల్ చేసేలా ఉన్నాడు. ఇప్పటికే ఫోర్ లాక్స్ ప్లస్ డాలర్స్ రాబట్టి ఒక రేంజ్ లో దూసుకపోతున్నాడు. ఒక్క హైదరబాద్ సిటీలోనే అడ్వాన్స్ బుకింగ్ 1క్రోర్ మార్క్ ను ఎప్పుడో దాటేశాడు భీమ్లా. బుక్ మై షో లేట్ గా స్టార్ట్ చేసినా, హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి భీమ్లానాయక్ టికెట్స్. బుక్ మై షో హిస్టరీలోనే రికార్డ్ స్తాయిలో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు ఆడియన్స్. పవన్ కల్యాణ్ కటౌట్స్ తో థియేటర్ బయటే కాదు, థియేటర్ లోపల ఫస్ట్ డే సందడి పవరేంటో చూపించాలనుకుంటున్నారు ఫాన్స్.

Bheemla Nayak : డప్పు వాయించిన పవన్ కళ్యాణ్ , కేటీఆర్

వేరే హీరోలు పోటీలో ఉండకుండా వెనుకడుగు వేశారు. సో సింగిల్ గా థియేటర్స్ ను దున్నేయపోతున్నాడు భీమ్లానాయక్. రామ్ చరణ్ తో పాటూ తెలుగు హీరోల ట్వీట్లు, కామెంట్లు భీమ్లా నాయక్ టాపిక్ లేకుండా ఉండటం లేదు. ఇక 24న అజిత్ వలిమై.. పవన్ తో పాటే అలియా గంగూభాయ్ వస్తున్నా భీమ్లా నాయక్ హైప్ ముందు ఆ సినిమాలు తేలిపోతున్నాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే క్రేజ్ పెరుగుతుందోమో. మొత్తానికి ప్రీ రిలీజ్ కే ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న భీమ్లా ఆఫ్టర్ రిలీజ్ ఇంకెంత ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి.