Bheemla Nayak: హిందీలో భీమ్లా రిలీజ్.. కానీ ప్రమోషన్ ఎక్కడ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా పీక్స్ కి చేరేందుకు మరో 24 గంటలు మాత్రమే మిగిలింది.

Bheemla Nayak: హిందీలో భీమ్లా రిలీజ్.. కానీ ప్రమోషన్ ఎక్కడ?

Bheemla Nayak (1)

Updated On : February 24, 2022 / 9:19 AM IST

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా పీక్స్ కి చేరేందుకు మరో 24 గంటలు మాత్రమే మిగిలింది. థియేటర్లలో బొమ్మ పడి.. తెర మీద పవన్ ను చూస్తే కానీ మాకు ప్రశాంతంగా నిద్రపట్టదు అంటున్నారు ట్రైలర్ చూసిన ఫ్యాన్స్. ఫైనల్ గా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ ఏడాదికి ఇదే తొలి భారీ సినిమా కావడంతో ఫలితం ఎలా ఉంటుందా అని సినీ పరిశ్రమ కూడా ఆసక్తిగా చూస్తుంది.

Bheemla Nayak: బెనిఫిట్ షో వేస్తే కఠిన చర్యలే.. ఏపీ ప్రభుత్వం నోటీసులు

కాగా, భీమ్లా నాయక్ సినిమాను హిందీలో కూడా విడుదల చేయనున్నట్లు నిర్మాత గత వారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పాటు హిందీలో కూడా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ప్రకటన అయితే చేశారు కానీ అక్కడ ఈ సినిమాకి కనీస ప్రమోషన్ కూడా చేపట్టడం లేదు. ఏవో నాలుగైదు పోస్టర్లు కనిపిస్తున్నాయ్ తప్ప హంగామా అసలేలేదు. రిలీజ్ కి ఒక్క రోజే ఉన్నా ఇప్పటికీ హిందీ ట్రైలర్ విడుదల కాలేదు.

Bheemla Nayak : డప్పు వాయించిన పవన్ కళ్యాణ్ , కేటీఆర్

దీంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. భీమ్లా నాయక్ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమానుకు రీమేక్. జాన్ అబ్రహమ్, అర్జున్ కపూర్ మెయిన్ లీడ్ లో ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. మిషన్ మంగల్ డైరెక్టర్ జగన్ శక్తి తెరకెక్కిస్తున్నాడు. మరి సేమ్ స్టోరీతో పవన్ కళ్యాణ్ డబ్బింగ్ సినిమా రిలీజ్ అయితే రీమేక్ వెర్షన్ పై దెబ్బ పడుతుంది. అందుకే సోసోగా భీమ్లా నాయక్ సినిమాని అక్కడ రిలీజ్ చేస్తున్నారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.