Big Boss 5: బయటపడిన కాజల్‌ బండారం.. సరయు బూతులకు గ్రీన్ సిగ్నల్

బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్ లో మొదటి వారం విజయవంతంగా పూర్తి అయింది. శనివారం నాగార్జున షో హోస్ట్ గా హాజరు కావడంతో హౌస్ మేట్స్ అందరిలో ఆసక్తి నెలకొంది. నాగ్ కూడా అందుకు తగ్గట్లే..

Big Boss 5: బయటపడిన కాజల్‌ బండారం.. సరయు బూతులకు గ్రీన్ సిగ్నల్

Big Boss 5

Big Boss 5: బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్ లో మొదటి వారం విజయవంతంగా పూర్తి అయింది. శనివారం నాగార్జున షో హోస్ట్ గా హాజరు కావడంతో హౌస్ మేట్స్ అందరిలో ఆసక్తి నెలకొంది. నాగ్ కూడా అందుకు తగ్గట్లే హౌస్ సభ్యులను ఎవరికి వారికి తగ్గట్లే సూచనలు, హెచ్చరికలు చేశాడు. నాగార్జున వచ్చే సమయం కావడంతో హౌస్ మేట్స్ అంతా గ్లామరస్ గా తయారవగా నాగార్జున కూడా మొదటి వారం కావడంతో కాస్త లైట్ గానే వదిలేద్దాం అంటూనే ప్రేక్షకులకు ముందుగానే హింట్ ఇచ్చి సభ్యులతో మాట్లాడడం మొదలుపెట్టారు.

Rajinikanth: మళ్ళీ మాస్ యాంగిల్ మీదే ఫోకస్ చేసిన రజనీ

ముందుగా ఆనీ మాస్టర్ తో మొదలు పెట్టినా నాగ్ చివరికి జెస్సీ వరకు మాట్లాడి టెన్షన్ పడవద్దు అని అభయం చెప్పాడు. అయితే, ఇందులో కాజల్ గురించి ఒక బండారం బయటపెట్టాడు. కాజల్ ను నాగ్ నీకు వంట రాదా అని అడిగితే.. కాజల్ నాకు రాదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ నాగ్ దానికి అవాక్కయ్యే కౌంటర్ ఇచ్చాడు. నీ ఇంస్టాగ్రామ్ చెక్ చేస్తే అందులో అన్ని వంటలే కదా మరి అదెలా అని అడిగాడు. లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఏం చేయాలో తెలియక ఆ వంటలు చేసి వీడియోలుగా మార్చి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశానని కాజల్ దాన్ని కూడా కవర్ చేసుకొనే ప్రయత్నం చేసింది.

Telugu Young Heros: యాక్షన్ మీద మోజు పడుతున్న రొమాంటిక్ హీరోలు

కానీ.. దొంగ దొరికిపోయింది అన్నట్లుగా నాగ్ ఇక వంట మీద దృష్టి పెట్టండి అన్నట్లుగా వార్నింగ్ ఇచ్చాడు. ఇక, ఇదే ఎపిసోడ్ వేదికగా నాగ్ ఇంటి సభ్యురాలైన సరయుకి ఒక రకంగా బూతులకు పర్మిషన్ ఇచ్చేశాడు. సరయు నువ్వు నీలానే ఉండు.. దేనికి వెనక్కి తగ్గాల్సిన పనిలేదని పచ్చ జెండా ఊపేసాడు. దానికి మీరు సరయు మీరు తిడతారేమోనని ఇలా ఉన్నానని చెప్తూ ఇక చూస్కో నా ప్రతాపం అన్నట్లే వచ్చే ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో ప్రేక్షకులకు హింట్ ఇచ్చేసింది. ఇక, జెస్సీని స్ట్రాంగ్ ఉండాలని నాగ్ బెదిరిస్తారని ప్రేక్షకులు ఊహించినా నాగ్ మాత్రం జెస్సీని కీప్ ఇట్ అప్ అంటూ మాటలతోనే భుజం తట్టి ఎంకరేజ్ చేశాడు.