Rajinikanth: మళ్ళీ మాస్ యాంగిల్ మీదే ఫోకస్ చేసిన రజనీ

రజనీకాంత్.. ఆ స్టైల్.. ఎనర్జీని చూడడానికి ఆడియన్స్ ఎప్పుడూ ఎదురుచూస్తునే ఉంటారు. 70 ఏళ్లకు దగ్గరైనా రజనీలో ఆ అగ్రెసివ్ చూడడానికే ఇష్టపడతారు ఫ్యాన్స్

Rajinikanth: మళ్ళీ మాస్ యాంగిల్ మీదే ఫోకస్ చేసిన రజనీ

Rajinikanth

Updated On : September 12, 2021 / 10:48 AM IST

Rajinikanth: రజనీకాంత్.. ఆ స్టైల్.. ఎనర్జీని చూడడానికి ఆడియన్స్ ఎప్పుడూ ఎదురుచూస్తునే ఉంటారు. 70 ఏళ్లకు దగ్గరైనా రజనీలో ఆ అగ్రెసివ్ చూడడానికే ఇష్టపడతారు ఫ్యాన్స్. మొన్నామధ్య ఎక్స్ పెరిమెంట్స్ చేసి దెబ్బతిన్న రజనీ.. ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకుని యాక్షన్ మోడ్ లోకి వచ్చేశారు. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ యూటర్న్ తీసుకున్నారు. పాత రజనీ దారిలోకే వెళుతున్నారు. ఈమధ్య సినిమాల స్పీడ్ తగ్గించిన రజనీకాంత్.. లేట్ అయినా లేటెస్ట్ గా వస్తున్న అన్నాత్తే సినిమాలో మాత్రం తన విశ్వరూపాన్ని చూపించబోతున్నారు.

Big Boss 5: బయటపడిన కాజల్‌ బండారం.. సరయు బూతులకు గ్రీన్ సిగ్నల్

భారీ స్టార్ కాస్ట్ తో శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న అన్నాత్తే మూవీ లుక్స్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేశారు తలైవా. ఇప్పటికే విడుదలైన అన్నాత్తే మూవీ లుక్ లో రజనీకాంత్.. కంప్లీట్ మాస్ గా కనిపిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్ ఫుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు. ఆ మధ్య కాలంలో కాలా, దర్బార్ , కబాలి తో ప్రయోగాలు చేసి.. కాస్త ట్రాక్ తప్పిన తలైవా.. ఇప్పుడు మళ్లీ పాత రజనీ గా యాక్షన్ టర్న్ తీసుకున్నారు.

Drugs Case: ఈడీ విచారణకు నవదీప్.. ఎఫ్‌ క్లబ్‌ పార్టీలపై అధికారుల ఫోకస్!

శివ డైరెక్షన్లో కీర్తిసురేష్ , ఖుష్బూ, మీనా లాంటి లీడ్ రోల్స్ తో తెరకెక్కుతున్న సినిమాలో రజనీకాంత్ మాస్ ఆడియన్స్ నే టార్గెట్ చేశారు. జనరల్ గా శివ అంతకుముందు సినిమాల్నీ యాక్షన్ ఓరియంటెడ్ మూవీసే. అందుకే రజనీతో చేస్తున్న అన్నాత్తేలో కూడా రజనీకాంత్ కంప్లీట్ మాస్ యాంగిల్ మీదే ఫోకస్ చేశారు. దీపావళి కానుకగా నవంబర్ 4న రిలీజ్ అవుతున్న అన్నాత్తేతో ఫ్యాన్స్ కి కంప్లీట్ ఫీస్ట్ ఇవ్వబోతున్నరు రజనీ.