Bigg Boss 5 : బిగ్ బాస్ 5లో బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ల సందడి

గత సీజన్ కంటెస్టెంట్లు అయిన దివి, మోనాల్ గజ్జర్ తో అందమైన అదిరిపోయే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అరేంజ్ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళతో పాటు అవినాష్, బాబా మాస్టర్ కూడా షోకి

Bigg Boss 5 : బిగ్ బాస్ 5లో బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ల సందడి

Bb4

Bigg Boss 5 :  బిగ్ బాస్ సీజన్ 5 లో ఈ వీకెండ్ ఎపిసోడ్ మాత్రం గట్టిగా ప్లాన్ చేసారు నిర్వాహకులు. ఇటీవల బిగ్ బాస్ ఎపిసోడ్స్ లో కేవలం గొడవలు, ఏడుపులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ వీకెండ్ లో మాత్రం ఫుల్ ఫన్ గా, ఎంటర్టైన్ గా ఉండబోతుంది అనిపిస్తుంది. మామూలుగానే వీకెండ్ ఎపిసోడ్స్ లో సెలబ్రిటీలని కూడా తీసుకొస్తారు. ఈ సారి దీపావళి కూడా ఉండటంతో ఈ ఆదివారం ఎపిసోడ్ ని దివాళి స్పెషల్ ఎపిసోడ్ గా మార్చేశారు. ఈ ఎపిసోడ్ ప్రోమోలని తాజాగా రిలీజ్ చేశారు. ఇవాళ రాత్రికి ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వనుంది. దివాళి స్పెషల్, వీకెండ్ కావడంతో ఈ సారి ఎక్కువ మంది గెస్ట్ లని పిలిపించారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రాజమౌళి సినిమా లేనట్టేనా??

ఒక పక్క యాంకర్ సుమ కామెడీ, హీరోయిన్ అవికా గోర్ మాస్ డ్యాన్స్, హీరోయిన్ శ్రేయ బ్యూటిఫుల్ ఎంట్రీ, ‘పుష్పక విమానం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండలు, సింగర్ కల్పన అలరించబోతున్నారు. ఇప్పటికే వీళ్ళకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయి ట్రెండ్ లో ఉంది. తాజాగా ఇవాళ్టి ఎపిసోడ్ కి సంబంధించి మరో ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో గత సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్లు సందడి చేశారు.

Bigg Boss 5 : అదిరిపోయిన దివాళి స్పెషల్ బిగ్ బాస్.. తరలి వచ్చిన సెలబ్రిటీలు

మరో వైపు గత సీజన్ కంటెస్టెంట్లు అయిన దివి, మోనాల్ గజ్జర్ తో అందమైన అదిరిపోయే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అరేంజ్ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళతో పాటు అవినాష్, బాబా మాస్టర్ కూడా షోకి వచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళు ఎలా చేస్తున్నారో ఇమిటేట్ చేసి చూపించారు. ఇదంతా చాలా ఫన్నీగా సాగింది. ఇవాళ రాత్రి ఈ స్పెషల్ ఎపిసోడ్ ని బిగ్ బాస్ నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేసారని తెలుస్తుంది. ఇవాళ రాత్రికి బిగ్ బాస్ నుంచి మరింత ఫన్ రాబోతుంది.