Bigg Boss 5 : అదిరిపోయిన దివాళి స్పెషల్ బిగ్ బాస్.. తరలి వచ్చిన సెలబ్రిటీలు
ఈ సారి దీపావళి కూడా ఉండటంతో ఈ ఆదివారం ఎపిసోడ్ ని దివాళి స్పెషల్ ఎపిసోడ్ గా మార్చేశారు. ఈ ఎపిసోడ్ ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఇవాళ రాత్రికి ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వనుంది.

Biggboss Diwali
Bigg Boss 5 : వారం అంత గొడవలతో, టాస్కులతో సాగిపోతుంది బిగ్ బాస్. వీకెండ్ ఎపిసోడ్స్ మాత్రం ఫన్ గా, ఎంటర్టైన్ గా చూపిస్తారు. వీకెండ్ ఎపిసోడ్స్ లో సెలబ్రిటీలని కూడా తీసుకొస్తారు. ఈ సారి దీపావళి కూడా ఉండటంతో ఈ ఆదివారం ఎపిసోడ్ ని దివాళి స్పెషల్ ఎపిసోడ్ గా మార్చేశారు. ఈ ఎపిసోడ్ ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఇవాళ రాత్రికి ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వనుంది. దివాళి స్పెషల్, వీకెండ్ కావడంతో ఈ సారి ఎక్కువ మంది గెస్ట్ లని పిలిపించారు.
Bigg Boss 5 : బిగ్ బాస్ నుంచి లోబో అవుట్? సేఫ్ అయిన సిరి?
హీరోయిన్ శ్రియని తీసుకొచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు. నాగార్జున, శ్రియలు కలిసి చాలా సినిమాలు చేసి ఉండటంతో రావడంతోనే నాగార్జునకి హగ్ ఇచ్చింది. ఆ తర్వాత కంటెస్టెంట్స్ గురించి మాట్లాడింది. ఇక హీరోయిన్ అవికా గోర్ తో స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయించారు. అవికా తన డ్యాన్స్ తో అదరగొట్టింది. ‘పుష్పక విమానం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ, తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ షోకి వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చారు. అన్నదమ్ములు ఇద్దరూ కలిసి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సిరి.. ఆనంద్ కి ఐ లవ్ యు అని చెప్పడంతో నాగార్జున మొన్న నాకు చెప్పావు. ఇప్పుడు ఆనంద్ కి చెప్తున్నావు న్యాయమేనా అని అడిగాడు. సిరి.. అది అప్పుడు ఇది ఇప్పుడు అని నవ్వేసింది. సింగర్ కల్పనా తన సింగింగ్ తో అలరించింది. కెప్టెన్ షన్నుపై స్పెషల్ సాంగ్ పాడింది. ఇక చివరగా యాంకర్ సుమ వచ్చింది. సుమ నాగార్జునతో మీరు యాంకరింగ్ సీరియస్ గా తీసుకున్నారు. మా లాంటి వాళ్ళు ఏమైపోవాలి అని అనడంతో నాగార్జున నువ్వు ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టుకొని మరీ ఇక్కడికి వచ్చావు నీది బిజీ షెడ్యూల్ నాకంటే అని అన్నాడు. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అని సుమ అనడంతో నాకు కూడా వీళ్ళు ఇస్తున్నారు అని నాగార్జున నవ్వేశారు.
Bigg Boss 5 : కంటెస్టెంట్స్ పై సీరియస్ అయిన నాగార్జున.. హౌస్ లో ఎవరు ఎవర్ని కాటేస్తున్నారు?
ఈ ప్రోమో చూస్తుంటే ఇవాళ రాత్రికి దివాళి స్పెషల్ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో అందర్నీ మెప్పిస్తుంది అని అర్ధమవుతుంది. మొత్తానికి షోకి ఇంకా హైప్ తీసుకురావడానికి బిగ్ బాస్ నిర్వాహకులు బాగానే ట్రై చేస్తున్నారని అర్ధమవుతుంది.