Bigg Boss 5 : బిగ్ బాస్ నుంచి లోబో అవుట్? సేఫ్ అయిన సిరి?

 బిగ్‌బాస్ తెలుగు 5వ సీజ‌న్‌లో ఇప్పటికే 8 వారాలు అవ్వొస్తుంది. ఇప్పటివరకు ఏడుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. 19 మందితో మొదలు పెట్టిన బిగ్ బాస్ లో

Bigg Boss 5 : బిగ్ బాస్ నుంచి లోబో అవుట్? సేఫ్ అయిన సిరి?

Lobo

Updated On : October 31, 2021 / 11:37 AM IST

Bigg Boss 5 :  బిగ్‌బాస్ తెలుగు 5వ సీజ‌న్‌లో ఇప్పటికే 8 వారాలు అవ్వొస్తుంది. ఇప్పటివరకు ఏడుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. 19 మందితో మొదలు పెట్టిన బిగ్ బాస్ లో సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీద, శ్వేతా, ప్రియాలు ఇప్పటి దాకా ఎలిమినేట్ అయ్యారు. ఇక 8వ వారం ఎలిమినేషన్స్ లో రవి, లోబో, శ్రీరామచంద్ర, సిరి హన్మంత్‌, షణ్ముఖ్‌ జస్వంత్‌, మానస్ నామినేష‌న్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని తెలుసుకోవాలంటే ఇవాళ్టి రాత్రి ఎపిసోడ్ లో చూడాల్సిందే. కాని గత కొన్ని వారాలుగా ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని ముందుగానే లీక్ అవుతుంది. ఆ లీకుల్లో చెప్పేది కరెక్ట్ గానే ఉంటుంది.

Bigg Boss 5 : కంటెస్టెంట్స్ పై సీరియస్ అయిన నాగార్జున.. హౌస్ లో ఎవరు ఎవర్ని కాటేస్తున్నారు?

ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ర‌వి, శ్రీరామ్, మాన‌స్‌, ష‌ణ్ముఖ్‌ల‌కు ఓటింగ్ ప‌రంగా ఢోకా లేదు. వీళ్లంద‌రికీ భారీ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటి వరకు నామినేట్ అయినా సేఫ్ అయ్యారు. కాబ‌ట్టి వీళ్లంతా ఎలిమినేష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు. సిరి, లోబోల మధ్య ఎలిమినేష‌న్ వార్ నడుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వీళ్లిద్ద‌రిలో లోబో క‌న్నా సిరి బెట‌ర్ అన్న‌ది చాలామంది అభిప్రాయం. సిరి టాస్కులు బాగా ఆడుతుంది. అలాగే షన్నుతో క్లోజ్ గా ఉండటం కూడా తనకి కలిసొస్తుంది. ఇక లోభ కంటే సిరికే ఫాలోయింగ్ ఎక్కువ ఈ కారణాలన్నీ ఒక ఎత్తైతే ఇప్పటి దాక హౌస్ నుంచి ఎక్కువగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఈ సారి కూడా లేడీ కంటెస్టెంట్ ని పంపిస్తే హౌస్ లో గ్లామర్ ఉండదు. ఈ కారణాలన్నిటితో సిరి సేఫ్ అవ్వొచ్చనే అంటున్నారు.

RGV : దిశా ఎన్కౌంటర్ పై ఆర్జీవీ సినిమా ట్రైలర్ విడుదల

ఇక లోబో రవి చెప్పినట్టు వినడం, టాస్కుల్లో డల్ గా ఉండటం, ఫాలోయింగ్ ప్రకారం చూసుకున్నా సిరి కన్న తక్కువగా ఉండటం లోబోకి మైనస్ అవుతుంది. దీంతో పోల్స్ లోను లోబోకి తక్కువ ఓట్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ వారం లోబోనే ఎలిమినేట్ అయ్యాడని సమాచారం. లోబో ఎలిమినేట్ అవ్వడం వల్ల హౌస్ లో ఎవరికీ నష్టం కాని లాభం కాని లేదు. హౌస్ లో లోబోకి రవి క్లోజ్ కాబట్టి రవి ఎమోషనల్ అయినట్టు తెలుస్తుంది.