Bigg Boss 5 Winner: సన్నీ మ్యారేజ్ ప్రపోజల్.. రూ.100 కోట్ల కట్నం!

బిగ్ బాస్ విన్నర్ లలో కొంతమందికి సినిమా ఆఫర్లతో పాటు కెరీర్ లో బిజీ కాగా మరికొందరి లైఫ్ మాత్రం ఏ మాత్రం పెద్దగా మార్పు లేకుండా ఉంది. కంటెస్టెంట్లలో కూడా కొంతమంది బిగ్ బాస్ క్రేజ్..

Bigg Boss 5 Winner: సన్నీ మ్యారేజ్ ప్రపోజల్.. రూ.100 కోట్ల కట్నం!

Bigg Boss 5 Winner

Bigg Boss 5 Winner: బిగ్ బాస్ విన్నర్ లలో కొంతమందికి సినిమా ఆఫర్లతో పాటు కెరీర్ లో బిజీ కాగా మరికొందరి లైఫ్ మాత్రం ఏ మాత్రం పెద్దగా మార్పు లేకుండా ఉంది. కంటెస్టెంట్లలో కూడా కొంతమంది బిగ్ బాస్ క్రేజ్ తో వరస సినిమా ఆఫర్లు దక్కించుకుంటే మరికొందరు లైమ్ లైట్ లో కూడా లేకుండా పోతున్నారు. అయితే.. బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ ఇంటి నుండి వచ్చినా సన్నీకి సోషల్ మీడియాలో రోజుకి వేల మెసేజ్ లు కాల్స్ వస్తున్నాయట.

Bigg Boss 5 Telugu: సిరి-షణ్నుల రిలేషన్‌.. విన్నర్ సన్నీ కామెంట్స్ వైరల్!

కాగా, సన్నీకి ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందట. అది కూడా అలాంటి ఇలాంటి ప్రపోజల్ కాదు.. ఓ మహిళ తన కూతురిని పెళ్లి చేసుకుంటావా రూ.100 కోట్ల కట్నం ఇస్తానని ఆఫర్ చేసిందట. అమెరికా నుంచి ఉష అనే మహిళ సన్నీకి వీడియో కాల్‌ చేసి తన కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగేసింది. కట్నంగా 100కోట్లు ఇస్తానని పేర్కొంది. ఇది సరదాగా అని భావించిన సన్నీ ‘నన్ను భరించాలంటే చాలా ఓర్పు ఉండాలి .. మీరు ఆ మాట అన్నారు చాలు’ అంటూ థాంక్స్ ఫీల్ తో ఆన్సర్‌ చెప్పాడు.

RRR: తారక్, చెర్రీ అన్నదమ్ముల బంధం.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

అయితే ఆ మహిళ మాత్రం.. నేను సీరియస్‌గా అడుగుతున్నా అంటూ ఆమె లైవ్‌లోనే పెళ్లి సంబంధం మాట్లాడేసింది. ప్రస్తుతం సన్నీకి వచ్చిన ఈ మ్యారేజ్ ప్రపోజల్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. సన్నీ మ్యారేజ్ ప్రపోజల్ పై నెటిజన్లు రకరకాలు కామెంట్స్ చేస్తుంటే.. సన్నీ అభిమానులు మాత్రం ఇదీ సన్నీ అన్న క్రేజ్ అంటూ ఖుషీ అవుతున్నారు.