RRR: తారక్, చెర్రీ అన్నదమ్ముల బంధం.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

మరో తొమ్మిది రోజులే ఉంది. ఆర్ఆర్ఆర్ కౌండ్ డౌన్ మొదలు పెట్టిన మేకర్స్.. విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ ప్రమోషన్లతో మోత ఎక్కిస్తున్నారు. ఇప్పటికే నార్త్ లో ప్రమోషన్ల హోరు ఎత్తించిన..

RRR: తారక్, చెర్రీ అన్నదమ్ముల బంధం.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

Rrr

RRR: మరో తొమ్మిది రోజులే ఉంది. ఆర్ఆర్ఆర్ కౌండ్ డౌన్ మొదలు పెట్టిన మేకర్స్.. విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ ప్రమోషన్లతో మోత ఎక్కిస్తున్నారు. ఇప్పటికే నార్త్ లో ప్రమోషన్ల హోరు ఎత్తించిన ఆర్ఆర్ఆర్ టీం తాజాగా చెన్నైలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. తమిళ స్టార్స్ శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ సహా మరికొందరు హాజరైన ఈ ఈవెంట్ లో తెలుగు హీరోల మీద మరికాస్త గౌరవం పెరిగిలా చేశారు ఆర్ఆర్ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్.. దర్శకుడు రాజమౌళి.

RRR: ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా ప్రచారం.. నిజమెంత?

ఈ వేడుకలలో మాట్లాడిన రాజమౌళి తారక్-చరణ్ తో అనుబంధాన్ని చెప్పుకొని ఎమోషనల్ కాగా.. హీరోలు ఒకరి మీద మరొకరి ప్రేమను బయట పెట్టారు. ముఖ్యంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలైతే ఇద్దరు హీరోల అభిమానులకు పండగలా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమా తనకు ఎన్టీఆర్ రూపంలో ఒక సోదరుడిని ఇచ్చిందని.. ఈ సోదర బంధాన్ని చచ్చే వరకు మర్చిపోనని ఎమోషనల్ గా చెప్పుకున్నాడు. ఎన్టీఆర్ మెంటాలిటీ పిల్లలలాగా ఉంటూ వైఖరి మాత్రం సింహంలా కనిపిస్తాడని ఆకాశానికి ఎత్తేశాడు.

RRR: సల్మాన్‌తో కలిసి ‘నాటు’ స్టెప్పులేసిన తారక్-చరణ్!

ఇక ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్ గురించి అలాగే చెప్పాడు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తాము స్నేహితులం కాలేదని.. ఆర్ఆర్ఆర్ సినిమా మమ్మల్ని స్నేహితులను చేసిందని.. ఈ స్నేహం ఆర్ఆర్ఆర్ తో ముగిసేది కాదని.. జీవితాంతం మిగిలేదని గుర్తు చేసుకున్నాడు. ఇక రాజమౌళి కూడా తమ హీరోల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. మొత్తంగా హైదరాబాద్ లో మొన్నటి వేడుక ఈ ముగ్గురి మధ్య చిలిపి అల్లరితో హైలెట్ కాగా చెన్నై వేడుక ఎమోషనల్ భావాలతో హైలెట్ అయింది. ఈ ఇద్దరి హీరోల కామెంట్స్ ఈ ఇద్దరి హీరోల అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ తెగ సందడి చేస్తున్నారు.